Share News

Vitamin Deficiency : పదే పదే తీపి తినాలనిపిస్తోందా.. ఈ విటమిన్ లోపం ఉందేమో చూసుకోండి..

ABN , Publish Date - Jan 19 , 2025 | 01:38 PM

స్వీట్లు అంటే మీకు చాలా ఇష్టమా. తీపి పదార్థాలు కనబడితే ఆగలేకపోతున్నారా. పదే పదే ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారా. అయితే, మీలో ఈ విటమిన్ లోపం ఉందేమో ఓ సారి చెక్ చేసుకోండి..

Vitamin Deficiency : పదే పదే తీపి తినాలనిపిస్తోందా.. ఈ విటమిన్ లోపం ఉందేమో చూసుకోండి..
This Vitamin Deficiency Causes Frequent Sweet Cravings

స్వీట్లు అంటే కొంతమందికి మహా ఇష్టం. నోరూరించే తీపి పదార్థాలు ఎక్కడ కనిపించినా ఓ పట్టు పట్టకుండా ఉండలేరు. అందులో మీరు కూడా ఉన్నారా. తీపి పదార్థాలు కనబడగానే ఆగలేకపోతున్నారా. పదే పదే తినాలనిపించి ఎక్కువ మొత్తంలో తినేస్తున్నారా. అయితే, మీలో ఈ విటమిన్ లోపం ఉందేమో ఓ సారి చెక్ చేసుకోండి. ఎందుకంటే, ఈ విటమిన్ లోపం ఉన్నవారిలోనే స్వీట్లు తినాలనే కోరిక బలంగా ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ బలహీనతను వదిలించుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టకపోతే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు..


ఆరోగ్య సమస్యలు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీకు ఎక్కువగా స్వీట్లు తినే అలవాటు ఉంటే అది సాధారణ విషయమే. కానీ, మీకు ప్రతిరోజూ తీపి పదార్థాలు తినాలనిపించినా, తరచుగా తినకపోతే మీ మనస్సుకు అసంతృప్తిగా అనిపిస్తున్నా తేలికగా తీసుకోకూడదు. ఇలాంటి బలహీనత ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందని చెప్పేందుకు ఇదొక సూచన. దీని గురించి సవివరంగా తెలుసుకుందాం.


ఈ విటమిన్ లోపం వల్లే మళ్లీ మళ్లీ స్వీట్లు తినాలని అనిపిస్తుంది..

విటమిన్ B అంటే B1 (థయామిన్), B3 (నియాసిన్), B5 (పాంతోతేనిక్ యాసిడ్), B6 ​​(పిరిడాక్సిన్), ఈ విటమిన్లు చక్కెర, శక్తికి సంబంధించినవి. ఇవి లోపిస్తే గనక మెదడుకు గ్లూకోజ్ తగ్గిందనే సంకేతం వెళ్లి పదే పదే తీసుకోవాలని మనల్ని ప్రేరేపిస్తుంది. శరీరంలో పరిమితికి మించి గ్లూకోజ్ స్థాయులు పెరిగితే ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.


పోషకాహార లోపం ఉంటే..

ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, జింక్ వంటి ఖనిజాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఈ పోషకాలు లోపించినా మళ్లీ మళ్లీ తీపి తినాలనే కోరిక కలుగుతుంది.

రక్తంలో చక్కెర స్థాయి తగ్గితే..

రక్తంలోని చక్కెర్ స్థాయిలో ఏర్పడే హెచ్చుతగ్గుల వల్ల కూడా స్వీట్లు ఎక్కువగా తింటారు.

హార్మోన్ల అసమతుల్యత..

హార్మోన్ల అసమతుల్యత మొత్తం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. పీరియడ్స్, మెనోపాజ్ కూడా చాలా మార్పులను తీసుకువస్తాయి. దీని వల్ల తీపి తినాలనే కోరిక పెరుగుతుంది.

Updated Date - Jan 19 , 2025 | 01:38 PM