Green Tea Uses: గ్రీన్ టీ తాగుతున్నారా? సరైన సమయం ఏదో తెలుసుకోండి.
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:19 PM
Best Time to Drink Green Tea: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే వేగంగా బరువు తగ్గుతారని చాలామంది అంటుంటారు. ఇంతకీ, గ్రీన్ టీ వల్ల పూర్తి ప్రయోజనాలు పూర్తిగా దక్కాలంటే రోజులో ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా..

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పానీయం బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకనే చాలామంది ఉదయం నిద్రలేచాక గ్రీన్ టీతోనే రోజును ప్రారంభిస్తారు. కానీ, ఖాళీ కడుపుతో ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలేంటి? గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి? ఎప్పుడు తాగకూడదో అనే సందేహాలకు నిపుణులు ఏమని సమాధానమిస్తున్నారో తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగవచ్చా?
గ్రీన్ టీలో టానిన్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో తీసుకుంటే కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, అజీర్ణం లేదా వికారం వంటి సమస్యలను కలిగిస్తాయి. ఈ పద్ధతి అనుసరించే వారిలో కడుపు సహజ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అంతేగాక, పోషకాహారం తీసుకున్నప్పటికీ శరీరం ఇనుమును గ్రహించలేదు. గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లే ఇందుకు ప్రధాన కారణం.
సరైన సమయం ఏది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు రెండే. భోజనం లేదా తేలికపాటి అల్పాహారం తర్వాత మాత్రమే ఈ పానీయం తీసుకోవాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత గ్రీన్ టీ తాగడం అత్యుత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లను అందుతాయి. శక్తి స్థాయిలను పెరుగుతాయి. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగినా జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమే.
గ్రీన్ టీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కడుపు సమస్యల త్వరగా నివారించి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. సాయంత్రం వేళల్లో శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే గ్రీన్ టీ తాగితే తక్షణమే ఎనర్జిటిక్ గా మారతాయి. ఇది శరీరంలో సహజ శక్తిని పెంపొందిస్తుంది. కొంతమంది వ్యాయామానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇది పనితీరు స్థాయిలను మెరుగుపరచడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
రోజుకు ఎన్ని కప్పులు తాగాలి?
సాధారణంగా రోజుకు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీ తాగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు నొప్పి, నిద్రలేమి, కాలేయంపై ఒత్తిడి వంటి పలు సమస్యలు వస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
మీరేంటో మీ పొట్ట చెప్పేస్తుంది..
ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ను వాడుతున్నారా.. ఈ విషయం తెలిస్తే..