ఈ జంతువు మాంసం తింటే పేగులు కుళ్లిపోతాయ్..!
ABN , Publish Date - Jul 20 , 2025 | 09:26 PM
ఈ మధ్య సమయం లేదనే కారణంతో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు బయటి తిండికి అలవాటు పడిపోతున్నారు. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ పరిమితికి మించి తినేస్తున్నారు. అయితే, ఈ జంతువు మాంసం అతిగా తింటే పేగులు కుళ్లిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నేటి తరం తమ బాగోగులు తాము చూసుకోవడానికే సమయం కేటాయించలేనంత బిజీ జీవితం గడుపుతున్నారు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ గత దశాబ్దంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. కేవలం ఈ రెండు కారణాల వల్లే చిన్నవయసులోనే దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. మందులు లేకుండా జీవనం సాగించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో పేగులకు సంబంధించిన వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు బయటి తిండికి అలవాటు పడిపోతుండటమే ప్రధాన కారణం. బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ పరిమితికి మించి తినేస్తున్నారు. అయితే, ఈ జంతువు మాంసం అతిగా తింటే పేగులు కుళ్లిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మన దేశంలో దీర్ఘకాలిక రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చాలా మంది ఏదొక వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు అతితక్కువ. ప్రతి వ్యక్తి మందుల సహాయంతోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి పేగు వ్యాధి. క్యాన్సర్ రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం అధికంగా మాంసాహారం తీసుకోవడం. ఈ రోజుల్లో చాలా మంది మాంసాహారం తినడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల వారు ప్రాణాంతకమైన కడుపు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. క్యాన్సర్, ప్రమాదకరమైన అల్సర్లు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, కొలైటిస్ ఇలా అనేక కడుపు సంబంధిత వ్యాధులు ప్రజల జీవితకాలాన్ని తగ్గిస్తున్నాయి.
క్యాన్సర్‌తో పాటు, చర్మం, రక్త సంబంధిత వ్యాధులు కూడా గణనీయంగా పెరిగాయి. రెడ్ మీట్అంటే గొడ్డు మాంసం తినడం వల్ల పేగులు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది దీనిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ, దీనిని తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇది ఎక్కువగా తింటే పేగులు కుళ్లిపోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో తీవ్రమైన కడుపు సంబంధిత వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలా నగరాల్లో ఎక్కువ మాంసం తినే వారికి కడుపు, పేగు, కాలేయ సమస్యలు ఎదురవుతున్నాయి.
కొన్ని దశాబ్దాల ముందు వరకూ ప్రజల జీవనశైలి ఇప్పటికంటే చాలా భిన్నంగా ఉండేది. చాలా శారీరక శ్రమ చేసేవారు కాబట్టి కఠినమైన మాంసం వంటి ఆహారాలను సులువుగా జీర్ణం చేసుకునేవారు. ఒత్తిడి తక్కువే. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాలుష్యం పెరిగింది. జంతువులు తీసుకునే ఆహారంలోనూ రసాయనాలు కలుస్తున్నాయి. వాటిలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. అలాంటి వాటి మాంసం తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతోంది. మాంసాన్ని అతిగా తీసుకునే వారికి తీవ్రమైన కడుపు సంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ తరహా ఆహారాన్ని నివారించడం గురించి ఆలోచించాలి. ఈ వ్యాధి వయసుబేధం లేకుండా అందరిలోనూ చాలా వేగంగా వ్యాపిస్తోంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ప్రతిరోజూ లెమన్ జ్యూస్ తాగితే అసిడిటీ వస్తుందా?
భోజనం చేసిన వెంటనే ధూమపానం.. ఇలా చేస్తే రిస్క్‌లో పడ్డట్టే..
For More Health News