Constipation: ఈ కూరగాయలంటే మీకిష్టమా.. జాగ్రత్త.. ఇవి తింటే మలబద్ధకం..
ABN , Publish Date - Apr 21 , 2025 | 07:32 AM
Vegetables That Cause Constipation: ఈ రోజుల్లో మలబద్ధకం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. చాలా మంది తప్పుడు ఆహారపు అలవాట్ల వల్లే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగే అందరికీ ఎంతో ఇష్టమయ్యే ఈ కూరగాయలు మలబద్ధకం సమస్యను పెంచుతాయి. కాబట్టి అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి.

Foods That Cause Constipation: నేటి కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారినీ మలబద్ధకం సమస్య వేధిస్తుంది. ఇదేం పెద్ద సమస్య.. మామూలే కదా అని జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో అనేక అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుంది. అందుకే సకాలంలో చికిత్స లేదా నివారణా చిట్కాలు పాటించి ఇతర సమస్యల ప్రమాదం పెరగకుండా చూసుకోవాలి.ప్రధానంగా తప్పుడు ఆహారపు అలవాట్ల వల్లే ఈ సమస్య వస్తుంది. ఆహారంలో ఫైబర్ లోపం ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. వారానికి మూడు సార్ల కంటే మలవిసర్జనకు వెళ్లినా, మలం గట్టిగా ఉండటం, మలవిసర్జనలో ఇబ్బంది, కడుపు నొప్పి లేదా తిమ్మిరి వంటివి మలబద్ధకాన్ని గుర్తించడానికి ప్రధాన లక్షణాలు. కొన్ని కూరగాయల వల్ల కూడా ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఆ కూరగాయలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
1) బెండకాయ
బెండకాయ చాలామందికి నచ్చే కూరగాయల్లో ఒక్కటి. ముఖ్యంగా దీంతో ఫ్రై చేసుకుని తినడానికే ఇష్టపడతారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జిగట, జిగురు ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఫైబర్, జిగురు లాంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివనే అనిపించవచ్చు. అందులో అబద్ధం కూడా లేదు. కానీ చాలామందికి ఈ పదార్థం అంత సులువుగా జీర్ణం కాదు. తరచూ తింటూ ఉంటే మలబద్ధకానికి దారితీస్తుంది.
2) క్రూసిఫెరస్ కూరగాయలు
బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు కొంతమంది వ్యక్తులలో గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి. ఇది మలబద్ధకం లక్షణాలను మరింత తీవ్రం చేయవచ్చు.
3) క్యారెట్
క్యారెట్లను సాధారణంగా ఫైబర్‌కు మంచి వనరుగా పరిగణిస్తారు. అయితే, పచ్చిగా లేదా పెద్ద పరిమాణంలో తింటే అది జీర్ణం కావడం కష్టమై మలబద్ధకానికి కారణం కావచ్చు.
4) సెలెరీ
సెలెరీలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇందులోని పీచు పదార్థాలు కొంతమందిలో జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల మలబద్ధకం వచ్చే అవకాశాలు ఇంకా పెరుగుతాయి.
Read Also: Health Tips: ఈ పండ్లు తిన్నాక నీరు తాగితే.. కడుపులో ఏ సమస్యలు వస్తాయో తెలుసా..
Low Sugar Diet: డయాబెటిస్ భయంతో చక్కెర తినడం తగ్గించారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుంది..
Effects Of Tight Clothes: బిగుతైన దుస్తులతో కలిగే అనర్థాలు ఇవే