Share News

Vitamin B12 Foods: విటమిన్ బి 12 తక్కువగా ఉందా..రోజూ ఈ పొడిని పెరుగుతో కలిపి తింటే చాలు..

ABN , Publish Date - Apr 17 , 2025 | 01:37 PM

Boost Vitamin B12 Naturally: శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్ బి 12 కొన్ని రకాల ఆహారాల్లోనే లభిస్తుంది. అందుకే ఈ విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. సప్లిమెంట్లతో పని లేకుండా సహజంగా ఈ లోపాన్ని అధిగమించే అవకాశాలు తక్కువని అందరూ అనుకుంటారు. కానీ, ఒక సులభమైన పరిష్కారముంది. ఈ పొడిని రోజూ పెరుగులో కలుపుకుని తింటే గనక విటమిన్ బి 12 సమస్యే రాదు.

Vitamin B12 Foods: విటమిన్ బి 12 తక్కువగా ఉందా..రోజూ ఈ పొడిని పెరుగుతో కలిపి తింటే చాలు..
How to Overcome Vitamin B12 Deficiency Naturally

Natural Sources For Vitamin B12: విటమిన్ బి12 మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాలలో ఒకటి. ఈ ప్రత్యేక విటమిన్ నరాలను బలపరుస్తుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలను వృద్ధికి, మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అయితే, నేటి కాలంలో విటమిన్ బి12 లోపం అందరిలో ఒక సాధారణ సమస్యగా మారుతోంది. బి12 ప్రధానంగా మాంసాహార ఆహారంలో కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా శాకాహారులలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి వారిలో బలహీనత, అలసట, నీరసం, ఒత్తిడి, రక్తహీనత ఇలా అనేక సమస్యలు కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు సాధారణంగా సప్లిమెంట్లపైనే ఆధారపడుతుంటారు. కానీ, ఈ సమస్యను సహజంగా పరిష్కరించుకునేందుకు ఓ మార్గముంది.


విటమిన్ బి 12 లోపం వల్ల తల తిరగడం, చేతులు, కాళ్ళలో జలదరింపు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి అనేక సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. మీరు కూడా అలాంటి సమస్యలను ఎదుర్కొంటుంటే.. కింద చెప్పిన చిట్కా మీకు తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ బి 12 స్థాయిని సహజ పద్ధతిలో పెంచుకునేందుకు ఒక సులభమైన టిప్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.


శరీరంలో విటమిన్ బి12 ని ఎలా పెంచాలి?

మీరు ఖరీదైన సప్లిమెంట్లు లేకుండా సహజ పద్ధతిలో విటమిన్ బి12 మొత్తాన్ని పెంచుకోవాలనుకుంటే.. ఇందుకోసం మీరు రోజూ పెరుగులో ఒక చిన్న చెంచా ఆమ్లా లేదా ఉసిరి పొడిని కలుపుకుని తినవచ్చు. పెరుగు, ఉసిరి కలయిక శరీరంలో విటమిన్ బి12 మొత్తాన్ని పెంచడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.


విటమిన్ బి12 వల్ల ఎలాంటి ప్రయోజనాలు?

  • అనేక అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడించిన ఫలితాల ప్రకారం చూస్తే పెరుగులో మంచి మొత్తంలో విటమిన్ బి12 ఉంటుందని తేలింది. 100 గ్రాముల పెరుగులో దాదాపు 0.5 మైక్రోగ్రాముల బి12 ఉంటుంది. అందుకే రోజూ పెరుగు తినడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని సహజంగా అధిగమించవచ్చు.

  • మెరుగైన ఫలితాల కోసం మీరు పెరుగులో 1 టీస్పూన్ ఉసిరి పొడిని జోడించి తినవచ్చు. ఉసిరి శరీరంలో నేరుగా విటమిన్ బి12 ను ఉత్పత్తి చేయదు. అయితే, ఇందులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆహారం నుంచి విటమిన్ బి12 ను గ్రహించడంలో సహాయపడతాయి. దీనితో పాటు కోబాల్ట్ అనే ఖనిజం కూడా ఆమ్లాలో తక్కువ పరిమాణంలో కనిపిస్తుంది. ఇది శరీరం బి12 ను క్రియాశీల రూపంలో ఉపయోగించుకోవడానికి సహకరిస్తుంది.


వీరు జాగ్రత్త

పెరుగు, ఉసిరి విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి సహజమైన, సురక్షితమైన, మార్గం. అయితే, మీకు గ్యాస్ లేదా ఆమ్లత్వంతో తీవ్రమైన సమస్య ఉంటే ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం మానుకోండి. అలా కాకుండా, బి12 లోపం చాలా తీవ్రంగా ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.


Read Also: Jamun Benefits: నేరేడు పండ్ల విత్తనాలు పారేస్తున్నారా.. ఇలా వాడితే ఆ సమస్యలు పోతాయ్....

ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం..

Diseases:ఈ సాధారణ వ్యాధులు సైలంట్ కిల్లర్స్.. ఆ లక్షణాలను గుర్తించడమెలా..

Updated Date - Apr 17 , 2025 | 01:38 PM