Share News

Health Tips: ఎండకు అలసిపోతున్నారా.. ఈ సరదా వర్కవుట్లతో బైబై చెప్పండి..

ABN , Publish Date - May 18 , 2025 | 05:57 PM

Summer Workout Tips: వేసవిలో విపరీతమైన ఎండల కారణంగా ఏ పని చేయకపోయినా త్వరగా అలసట, నీరసం ఆవహిస్తాయి. ఉత్సాహంగా ఉండలేరు. అయితే, ఈ సరదా వర్కవుట్లతో ఈ సమస్యలకు ఈజీగా తరిమికొట్టచ్చు.

Health Tips: ఎండకు అలసిపోతున్నారా.. ఈ సరదా వర్కవుట్లతో బైబై చెప్పండి..
Summer Workout Tips

Best Workouts In Hot Weather: సమ్మర్‌లో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల వల్ల త్వరగా నీరసించిపోతారు. అన్ని కాలాల్లో లాగా వర్కవుట్లు చేసేందుకు ఓపిక ఉండదు. రోజంతా అలసటగా ఉంటుంది. దీంతో చిరాగ్గా ఉండి ఏ పనిపైనా దృష్టి సారించలేకపోతారు. వేసవి తాపం భరించలేక పదే పదే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, జ్యూస్ లు వంటి చల్లటి వాటినే అధికంగా సేవిస్తారు. ఈ అలవాటు వల్ల శరీరంలో అనవసర కేలరీలు పేరుకుపోవడం స్టార్ట్ అవుతుంది. అయితే, హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడకుండానే సరదాగా ఈ కింది వ్యాయామాలు చేసేయండి. మండే ఎండల్లోనూ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.


ఈత కొట్టడం : వేసవిలో ఈత కొట్టడం అనేది ఒక ప్రశాంతమైన, బాగా ఆనందించదగిన వ్యాయామం. దీనివల్ల శారీరకంగా, మానసికంగా రిలాక్స్ అయిపోతారు. ఈత వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం, కండరాల బలం కూడా మెరుగుపడతాయి. అలాగే, మీకు స్విమ్మింగ్ రాకపోతే ఈ ఎండాకాలం సెలవుల్లో అయినా నేర్చుకోండి. ఎందుకంటే ఈత వేగంగా బరువు తగ్గించే ఒక చక్కటి వ్యాయామం.


పరుగు : పరుగు ఫిట్‌నెస్ ప్రియులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇతర సీజన్ల కంటే వేసవిలో ఎక్కువ కేలరీల బర్న్ చేసుకోవచ్చు. రన్నింగ్ వల్ల చెమట ఎక్కువగా పట్టి శరీరం చల్లబడుతుంది. మరో ప్రయోనం ఏంటంటే, ఉదయాన్నే రన్నింగ్ చేయడం సూర్యరశ్మి తాకి విటమిన్ డి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటారు.


స్కిప్పింగ్ : జంపింగ్ రోప్ అనేది మీ ఫిట్‌నెస్ కే కాదు మొత్తం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. అంతేగాక స్కిప్పింగ్ ఒక ఆహ్లాదకరమైన వర్కవుట్. శరీరంలోని పై భాగం, దిగువ భాగం రెండింటికీ చక్కటి వ్యాయామం. గజిబిజి జీవనశైలి, బిజీ షెడ్యూల్‌ ఉన్న వ్యక్తులకు ఫిట్‌నెస్ కోసం స్కిప్పింగ్ బెస్ట్ ఆప్షన్. దీనికోసం కాస్త స్థలం, స్కిప్పింగ్ రోప్ ఉంటే చాలు.


డాన్స్ : మీరు సాధారణ జిమ్, ఫిట్‌నెస్ వర్కవుట్లతో విసుగు చెంది ఉంటే ఇంట్లోనే సరదాగా డాన్స్ చేయండి. హార్ట్ బీట్ రేట్ పెరగడంతో పాటు శరీరంలోని ఫ్యాట్ కూడా ఈజీగా కరిగిపోతుంది. డాన్స్ చేసే సమయంలో చెమట పట్టి శరీరం డీటాక్సిఫై అవుతుంది. బాడీ ఉష్ణోగ్రత కూడా బయటకు వెళ్లిపోతుంది.


సైక్లింగ్: కేలరీలను బర్న్ అయ్యేందుకు సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం. ఈ వేసవిలో మీరు సరదా వర్కవుట్లతో బరువు తగ్గాలనుకుంటే స్నేహితులతో సైక్లింగ్ చేయడం ఉత్తమం. మీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు ఇదో గొప్ప మార్గం. సైక్లింగ్ వల్ల రక్క ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల స్టామినా, ఓర్పు, కండరాల బలం పెరుగుతాయి.


పై కార్యకలాపాలతో పాటు ఎండల్లో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోండి. ప్రతిరోజూ తప్పకుండా 7-9 గంటలు నిద్రపోండి. అలాగే ఒత్తిడి నిర్వహణకు ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేస్తే చాలా మంచిది.‌


Read Also: Blood Pressure: ఉప్పు వల్లే కాదు.. ఇవి తిన్నా బీపీ అమాంతం పెరిగిపోతుంది..

Health Tips: భోజనం తర్వాత నిద్రమత్తుగా ఉంటుందా..

Egg Diet Tips: రోజూ ఎన్ని గుడ్లు తినాలి.. అతిగా తినడం వల్ల ఈ సమస్యలు వస్తాయా..

Updated Date - May 18 , 2025 | 06:44 PM