Share News

Hyderabad: ‘బసవతారకం’లో నేటినుంచి క్యాన్సర్‌ ప్రాథమిక పరీక్షలు

ABN , Publish Date - Feb 04 , 2025 | 08:06 AM

ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి(Basavatarakam Hospital)లో మంగళవారం (ఈనెల 4నుంచి 28వ తేదీ వరకు) నుంచి కేన్సర్‌ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తునట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

Hyderabad: ‘బసవతారకం’లో నేటినుంచి క్యాన్సర్‌ ప్రాథమిక పరీక్షలు

- రూ.1500లకే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌

హైదరాబాద్‌ సిటీ: ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని బసవతారకం ఆస్పత్రి(Basavatarakam Hospital)లో మంగళవారం (ఈనెల 4నుంచి 28వ తేదీ వరకు) నుంచి కేన్సర్‌ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తునట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ శిబిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యాన్సర్‌ వైద్య నిపుణులు ఉచిత ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన వారికి 20 శాతం తగ్గింపుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి వీలు కల్పిస్తామని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: Waterboard: ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్‌ కేసులు..


ఈ నెల మొత్తం అత్యంత తక్కువ ఖర్చుతో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌(HPV vaccine) వేయించుకొనే సదుపాయాన్ని అందుబాటులోనికి తెచ్చినట్టు తెలిపాయి. ఒక్క డోసుకు దాదాపు రూ. 4వేలు విలువ చేసే ఈ వ్యాక్సిన్‌ను కేవలం ఒక డోసు రూ. 1500లకే అందించనున్నాను. ఈ సదుపాయాలను అవసరమైన వారు ఉపయోగించుకోవాలని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి(Basavatarakam Indo American Cancer Hospital), రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం కోరింది.

city3.2.jpg


ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి

ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 04 , 2025 | 08:06 AM