Share News

BP: బీపీ కంట్రోల్ కావాలంటే.. ఈ 5 అలవాట్లను వెంటనే మానేయండి..!

ABN , Publish Date - Jun 01 , 2025 | 09:45 AM

What Causes Blood Pressure: శరీరంలో రక్తపోటును నియంత్రించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ దీర్ఘకాలిక వ్యాధి వల్ల కలిగే తీవ్ర అనారోగ్య సమస్యలను నివారించాలంటే ఈ 5 రోజువారీ అలవాట్లను వెంటనే మానేయాలి.

BP: బీపీ కంట్రోల్ కావాలంటే.. ఈ 5 అలవాట్లను వెంటనే మానేయండి..!
Lifestyle Habits That Increase Blood Pressure

Lifestyle Habits That Increase Blood Pressure: సాధారణంగా అధిక రక్తపోటును "నిశ్శబ్ద హంతకుడు" అని పిలుస్తారు. ఎందుకంటే హై బీపీ ఎక్కువగా గుండె, మెదడు లేదా మూత్రపిండాలకు గణనీయమైన హాని కలిగిస్తుంది. ప్రాణాంతక పరిస్థితి వచ్చే వరకూ లక్షణాలు గుర్తించడం కష్టం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం, భారతదేశంలో పెద్దవయసువారిలో 25% కంటే ఎక్కువ మందికి అధిక రక్తపోటు ఉంది. వంశపారంపర్యం, వయస్సుతో పాటు ఆహారపు అలవాట్లు, రోజువారీ జీవనశైలి శరీరంలో రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా ఈ కొన్ని అలవాట్ల వల్ల వ్యక్తి జీవనకాలం పడిపోతుంది. చిన్నవయసులోనే హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు అటాక్ చేయవచ్చు. కాబట్టి, ఆ అలవాట్లు ఏవో తెలుసుకుంటే ఈ సమస్యలు రాకుండా నివారించవచ్చు.


ధమని గోడలపై రక్తం ఒత్తిడి ఉంటుంది. దీన్నే రక్తపోటు అంటారు. ఇది ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటే గుండె, రక్త నాళాలు సాధారణం కంటే ఎక్కువగా పనిచేయవలసి ఉంటుంది. ఇలా జరిగితే అవయవాలు వేగంగా దెబ్బతింటాయి. తినే విధానం మొదలుకుని ఒత్తిడిని నిర్వహణ వరకూ దైనందిన జీవితంలో మనం చేసే చాలా పనులూ బీపీ పెరుగుదలకు కారణమవుతాయి.


అధిక ఉప్పు

అధిక సోడియం అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్ భోజనం అధిక ఉప్పుతో నిండి ఉంటాయి. ఉప్పగా ఉండే ఆహారాలను తగ్గించడం, ఆహార లేబుళ్ళను తనిఖీ చేసి కొనుగోలు చేస్తే అధిక ఉప్పు సమస్య తగ్గించుకోవచ్చు.


శారీరక శ్రమ

నిశ్చల జీవనశైలి అంటే రోజులో చాలాసేపు శారీరక శ్రమకు దూరంగా ఉండటం వల్ల మీ జీవక్రియ మందగిస్తుంది. ఆ ప్రభావంతో బరువు పెరుగుతారు. ఈ రెండూ కూడా అధిక రక్తపోటుకు దారితీస్తాయి. కాబట్టి, మీ దినచర్యలో 30 నిమిషాల పాటు చురుకైన నడక కోసం కేటాయించండి. ఈ చిన్నపాటి మార్పులు కూడా రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.


కెఫీన్

కాఫీని మితంగా తీసుకోవడం అందరికీ హాని కలిగించకపోయినా రోజుకు అనేక సార్లు కాఫీ, టీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు తాత్కాలికంగా పెరుగుతుంది. అప్పటికే అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకు ఈ అలవాటు ఇంకా ప్రమాదకరం.


నిద్ర

తగినంత లేదా క్రమరహిత నిద్ర విధానాలు హార్మోన్ నియంత్రణ, ఒత్తిడి ప్రతిస్పందనకు అంతరాయం కలిగిస్తాయి. ఈ రెండూ రక్తపోటును పెంచుతాయి. అంతరాయం లేకుండా ప్రతి రాత్రి 7–8 గంటలు నిద్రపోండి. క్రమం తప్పకుండా ఒకే నిద్ర షెడ్యూల్‌ను పాటించండి.


దీర్ఘకాలిక ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడిని నియంత్రించకపోతే కాలక్రమేణా రక్తపోటు తీవ్రసమస్యగా మారుతుంది. కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదలై తాత్కాలికంగా రక్తపోటును మరింత పెంచుతుంది. దీర్ఘ శ్వాస, వ్యాయామాలు లేదా సన్నిహితులతో సరదాగా గడపడం లాంటి పనుల ద్వారా ఒత్తిడి నియంత్రణ కోసం ప్రయత్నాలు చేయాలి.


మనం తీసుకునే ఆహారం, నిద్రపోవడం లేదా ఒత్తిడిని ఎలా ఎదుర్కోవడం వంటి మన రోజువారీ ఎంపికలు మన హృదయనాళ వ్యవస్థను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయని మనలో చాలా మందికి తెలియదు. అధిక రక్తపోటుకు కారణమయ్యే ఈ అంశాలను గుర్తించడం నివారణకు మొదటి అడుగు. అత్యంత దారుణమైన సందర్భాల్లో హై బీపీ రోగుల్లో రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ అవసరం కావచ్చు లేదా మూత్రపిండాలు గణనీయంగా దెబ్బతిన్నట్లయితే డయాలసిస్ కూడా అవసరం కావచ్చు.


సమతుల్య ఆహారం, రోజువారీ శారీరక వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ వ్యూహాలు అనుసరిస్తూ రక్తపోటును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్య ప్రమాదాన్ని తగ్గుతుంది. జీవనశైలి మార్పులు సరిపోకపోతే మందులు, తదుపరి జాగ్రత్తల కోసం వైద్యుడిని సంప్రదించండి. సాధారణ అలవాట్లతో మీ ఆరోగ్యాన్ని చేజేతులా నిశ్శబ్దంగా నాశనం చేసుకోకండి.


ఇవి కూడా చదవండి:

ఉదయం నిద్ర లేవగానే తలనొప్పి వస్తోందా? ఈ వ్యాధి లక్షణం కావచ్చు.. జాగ్రత్త..!

బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కొవిడ్ రాదా? నిపుణులు ఏమంటున్నారు?

Read Latest and Health News

Updated Date - Jun 01 , 2025 | 10:03 AM