Low BP Symptoms: ఈ 5 లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే లో బీపీ ఉన్నట్టే..
ABN , Publish Date - May 04 , 2025 | 08:14 AM
Common Symptoms Of Low BP: రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పటి కంటే తక్కువగా మరీ డేంజర్. అకస్మాత్తుగా లో బీపీ వస్తే ప్రాణానికి ప్రమాదం కావచ్చు. మీలో ఈ లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే అప్రమత్తమై చికిత్స తీసుకోండి.

Early Signs Of Low Blood Pressure: అధిక రక్తపోటు ఆరోగ్యానికి ప్రమాదమని మనం తరచూ వింటుంటాము. కానీ, లో బీపీ లేదా హైపోటెన్షన్ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకమే. ఇక ఎవరిలోనైనా రక్తపోటు అన్ని సమయాల్లో ఒకేలా ఉండదు. ఇది అనేక అంశాలపై ఆధారపడి మారుతుంది. వయస్సు, మందులు, జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా రక్తపోటు సమస్య వస్తుంది. మీ రక్తపోటు చాలా తక్కువగా ఉందని సూచించే 5 లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. మరి, శరీరం ఇచ్చే ఈ సంకేతాలేవో తెలుసుకుని ముందే జాగ్రత్తపడండి.
కొంతమంది తక్కువ రక్తపోటుతో బాధపడుతుంటారు. దీనిని హైపోటెన్షన్ అని కూడా పిలుస్తారు. మీ రక్తపోటు స్థాయిలు సాధారణ పరిధి కంటే తక్కువగా ఉన్నప్పుడు అంటే 90/60 mm Hg కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. నిర్జలీకరణం, గుండె సమస్యలు, మందులు ఇలా అనేక కారణాల వల్ల రక్తపోటు తగ్గవచ్చు. ప్రారంభ దశలోనే ఈ లక్షణాలను గుర్తించడం వల్ల మీరు దీర్ఘకాల సమస్యగా మారకముందే శాశ్వతంగా ఈ సమస్య నుంచి బయటపడగలరు. లో బీపీ ఉందని శరీరం ఇచ్చే 5 సంకేతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
తల తిరగడం
తక్కువ రక్తపోటు ఉండేవారిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణాల్లో ఒకటి తల తిరుగుతున్నట్లు అనిపించడం. ముఖ్యంగా త్వరగా లేచినప్పుడు. మీ శరీరం రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా తగ్గిపోయి మెదడుకు ప్రవహించే రక్త పరిమాణాన్ని తగ్గిపోతుంది. తద్వారా తల తిరుగుతున్నట్టుగా ఉన్న అనుభూతిని కలుగుతుంది.
అస్పష్టమైన లేదా మసకబారుతున్న దృష్టి
హైపోటెన్షన్ వచ్చిన సమయంలో, ముఖ్యంగా రక్తపోటు వేగంగా పడిపోతే కంటిచూపు అస్పష్టంగా లేదా మసకబారినట్టుగా అయిపోతుంది. మెదడు లాగే, కళ్ళకు కూడా నిరంతరం రక్త సరఫరా అవసరం. మీ రక్తపోటు స్థాయిలు పడిపోయినప్పుడు కళ్ళకు అవసరమైన ఆక్సిజన్ అందక దృష్టిలోపానికి దారితీస్తుంది.
అలసట, బలహీనత
తక్కువ రక్తపోటు ఉన్నప్పుడు నిరంతర అలసట లేదా కండరాల బలహీనతకు దారితీస్తుంది. రక్తపోటు స్థాయిలు తగ్గడం వల్ల శరీర అవయవాలు, కండరాలకు తగినంత ఆక్సిజన్ దొరకదు. పోషకాలను శరీరం గ్రహించలేకపోవచ్చు. దీని వలన అలసట, బలహీనత అనే లక్షణాలు కనిపిస్తాయి.
చలి, పాలిపోయిన చర్మం
రక్తపోటు తగ్గినప్పుడు శరీరం మెదడు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని పంపడంపై దృష్టి పెడుతుంది. దీని వలన చర్మం, చేతులు, కాళ్ళు వంటి భాగాలు చల్లగా మారి పాలిపోతాయి. శరీరం దాని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్రయత్నించడం వల్ల చెమటలు పట్టడం లేదా చర్మం జిగటగా మారవచ్చు.
క్రమరహిత హృదయ స్పందన
రక్తపోటు స్థాయిలు పడిపోయినప్పుడు ప్రసరణను నిర్వహించడానికి గుండె వేగంగా కొట్టుకోవచ్చు. దీని వలన మీ హృదయ స్పందన సక్రమంగా లేదా చాలా వేగంగా అనిపించవచ్చు. కానీ, శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోయి నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు.
Read Also: Cancer & Hair Loss: క్యాన్సర్ చికిత్స సమయంలో జుట్టు ఎందుకు రాలిపోతుంది..
Belly Fat: జిమ్, డైట్ అక్కర్లేదు.. ఈ చిన్నపాటి అలవాట్లతో బెల్లీ ఫ్యాట్ మాయం..
Heatwave Alert: మే నెల వచ్చేసింది.. హీట్ వేవ్స్ వల్ల ఈ సమస్యలు.. జాగ్రత్త..