Share News

Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అధిక్యత

ABN , Publish Date - Nov 14 , 2025 | 09:04 AM

పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత కనపరుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో మొత్తం 101 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అధిక్యతతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు మొదలు పెట్టారు.

 Jubilee Hills Bye Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అధిక్యత
Jubilee Hills Bye Election

హైదరాబాద్, నవంబరు14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election) కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ(శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కిస్తున్నారు ఎన్నికల సిబ్బంది. పోస్టల్ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యత కనపరుస్తోంది.


మొత్తం 101 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్39, బీఆర్ఎస్ 36, బీజేపీ10 వచ్చాయి. ప్రతిష్టాత్మకమైన ఎన్నిక కావడంతో ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను కౌంటర్ ఏజెంట్లుగా పెట్టింది కాంగ్రెస్, బీఆర్ఎస్. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. మొదటగా షేక్‌పేట్ డివిజన్‌లోని 42 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు లెక్కిస్తున్నారు. అయితే షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్ కనపరుస్తోంది. ఒక్కో రౌండ్ లెక్కింపు 30 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ రిజర్వేషన్లు భిక్ష కాదు.. మా హక్కు

సోయా, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులివ్వండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 09:30 AM