Share News

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీ మధ్యే పోటీ..

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:48 AM

జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీకి మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని పేర్కొన్నారు.

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీ మధ్యే పోటీ..
Ramachander Rao

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇవాళ (సోమవారం) స్టేట్ ఆఫీస్‌లో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని రామ్‌చందర్ రావు నేతృత్వంలో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే నగరంలోని కార్పొరేటర్లు, పార్టీ క్యాడర్‌ను ప్రచారంలోకి దింపాలని సమావేశంలో బీజేపీ నిర్జయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్ రెడ్డి వరుసగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో మజ్లిస్‌, బీజేపీకి మధ్యే పోటీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని పేర్కొన్నారు. మజ్లిస్‌ను ఆపాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌‌కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆరోపించారు.


అయితే.. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగియడంతో.. పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార బీఆర్ఎస్.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా విస్తృత ప్రచారానికి సిద్ధం అయింది. అయితే జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్.. 14న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 03:09 PM