GVL Narasimha Rao: బిహార్ విజయం.. మోదీ పాలనకు నిదర్శనం: జీవీఎల్ నరసింహారావు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:50 PM
ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామాను ప్రజల చెవుల్లో పడలేదని బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): బిహార్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో బీజేపీ, జేడీయూ కలిసి 202 స్థానాల్లో పోటీ చేసిందని వివరించారు. బిహార్ ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం దక్కడం కూటమి నేతల పనికి నిదర్శనమని ఉద్ఘాటించారు. బిహార్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉందని నొక్కిచెప్పారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో జీవీఎల్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు నిదర్శనంగా బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రజలు ఓటేశారని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ కేవలం నినాదం కాదని చెప్పుకొచ్చారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలనే విధంగా బిహార్ ప్రజలు ఓటేశారని చెప్పుకొచ్చారు. బిహార్ ఎన్నికలు కులాల సమీకరణ కాదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కులాల సమీకరణ ఉందని వివరించారు.బిహార్ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు పనిచేస్తాయని, ఈ విజయం అభివృద్ధికి దక్కిన పట్టమని ఉద్ఘాటించారు. ఇది అద్భుతమైన విజయమని నొక్కిచెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం నితీష్ కుమార్ చేసిన ప్రచారం, అభివృద్ధికి ప్రజలు ఓటు వేశారని చెప్పుకొచ్చారు జీవీఎల్ నరసింహారావు.
2000 సంవత్సరంలో ఆర్‌జేడీకి మెజార్టీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో పురుషులు ఆర్‌జేడీకి అధికంగా ఓట్లు వేశారని.. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మహిళలు బీజేపీకి అధికంగా ఓటు వేశారని తెలిపారు. మహిళా శక్తి అనేది అభివృద్ధికి, మంచి పాలనకు ఓటు వేశారని చెప్పుకొచ్చారు. ఓటు చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేసిన డ్రామా ప్రజల చెవుల్లో పడలేదని విమర్శించారు.
ఓట్ల చోరీని ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఒక స్థానిక ఎన్నిక అని చెప్పుకొచ్చారు. అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి పరిస్థితులు అనుకూలిస్తాయనేది ఒక ఆనవాయితీగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచిన రాబోయే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దిశగా అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ కిందికి దిగజారిపోయిందని జీవీఎల్ నరసింహారావు విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ: మంత్రి నారా లోకేష్
విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
Read Latest AP News And Telugu News