Share News

BSP Wins Ramgarh: సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:27 AM

బిహార్ లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు.

 BSP Wins Ramgarh: సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election Results 2025) ఎన్డీయే 202 స్థానాల్లో గెలిచి.. అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. నితీశ్ కుమార్ కు బిహారీ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. మహాగఠ్ బంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఇదే సమయంలో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ స్థానం(BSP Ramgarh win)లో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు. యాదవ్ 72,689 ఓట్లు (37.29%) పోలవగా.. సింగ్ 72,659 ఓట్లు (37.29%) సాధించారు. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది.


ఇది బీఎస్పీకి బిహార్‌లో ఏకైక విజయంగా నిలిచింది. ఇటీవల కాలంలో ఈ విజయం బీఎస్పీకి ఒక ముఖ్యమైన మైలురాయిగా మారింది. ఈ ఫలితం ఆఖరి వరకు ఉత్కంఠను రేకెత్తించింది. ఉత్తర్ ప్రదేశ్ లో 2007 నుండి 2012 వరకు బీఎస్పీ పాలన సాగింది. యూపీ సీఎంగా బీఎస్పీ(BSP) అధినేత్రి మాయవతి పని చేశారు. ఆ తర్వాత నుంచి చాలా ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్, యూపీలో బీఎస్పీ(Mayawati BSP Bihar win) తన ఖాతాను తెరవలేకపోయింది. ఇటీవలి కాలంలో బీఎస్పీకి ఇదే తొలి విజయం కావడం గమన్హారం.


అలానే బిహార్(Sandesh constituency) లోని సందేశ్ అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత స్వల్ప తేడాతో విజయం సాధించిన రికార్డును నమోదు చేసింది. జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సాహ్ తన ప్రత్యర్థి, ఆర్జేడీకి చెందిన దిపు సింగ్‌ను కేవలం 27 స్వల్ప ఓట్ల తేడాతో ఓడించారు. సాహ్ 80,598 ఓట్లు సాధించగా, సింగ్ 80,571 ఓట్లు పొందారు. ఈ ఇద్దరు అభ్యర్థుల తుది రౌండ్‌ లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఓటును అత్యంత జాగ్రత్తగా లెక్కించారు. ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యం వీరి చేతులు మారిది. చివరకు చరణ్ సాహ్ ను విజయం వరించింది.


ఇవీ చదవండి:

Jammu and Kashmir: ఫరీదాబాద్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 15 , 2025 | 09:27 AM