Scooter stunt video: ఇంత రిస్క్ ఎందుకు బ్రదర్.. బిజీ రోడ్డుపై స్కూటీ ఎలా నడుపుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Nov 15 , 2025 | 09:19 AM
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Bike stunt).
mere_hisaabh అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. లఖ్‌నవూలోని బిజీ రోడ్డుపై ఓ వ్యక్తి స్కూటీతో ప్రమాదకర స్టంట్ చేస్తున్నాడు. వాహనాలు తిరుగుతున్న బిజీ రోడ్డుపై పూర్తిగా చేతులు వదిలేసి స్కూటీ నడుపుతున్నాడు. అతడు పూర్తిగా స్కూటీ హ్యాండిల్ వదిలేసి చక్కగా సీటుపై మఠం వేసుకుని కూర్చున్నాడు. స్కూటీ ముందుకు దూసుకెళ్లిపోతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించలేం (Lucknow viral video).
అదే రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ అతడి స్టంట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు (funny viral clip). లఖ్‌నవూలో విచిత్రమైన వ్యక్తులు ఉన్నారని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను లక్షల మంది వీక్షించారు. పది వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. అతడు చాలా రిలాక్స్‌డ్‌గా డ్రైవింగ్ చేస్తున్నాడని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పిల్లిని మింగుతున్న కొండచిలువ.. తర్వాతేం జరిగిందంటే..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలోని రెండో వ్యక్తిని 15 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..