SBI CBO Jobs: డిగ్రీ అర్హతతో SBIలో ఆఫీసర్ అయ్యే ఛాన్స్.. 2600లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ABN , Publish Date - Jun 23 , 2025 | 02:51 PM
SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్‌మెంట్ 2025 కోసం మళ్లీ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయిన అభ్యర్థులు ఈసారి ఛాన్స్ మిస్సవకండి. గడువు తేదీ జూన్ 30 కి ముందే అప్లై చేసుకోండి.

SBI Circle Based Officer Jobs: భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన SBIలో ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి గోల్డెన్ ఛాన్స్. అవును, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను తిరిగి ప్రారంభించింది . బ్యాంకులో ఆఫీసర్‌గా పనిచేయాలని కోరుకునే వారికి, ఏదైనా కారణం చేత గతంలో అవకాశం అందుకోలేకపోయినవారికి ఇదే సదవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో జూన్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్‌మెంట్ 2025 కింద 2600 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను మరోసారి ప్రారంభించింది. గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఇప్పుడు జూన్ 21 నుండి జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 2600 పోస్టులను భర్తీ చేస్తారు, వీటిలో 1066 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి, 387 ఎస్సీకి, 190 ఎస్టీకి, 697 ఓబీసీకి, 260 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రిజర్వ్ చేశారు.
అర్హత
అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడై ఉండాలి. అలాగే బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం. వయోపరిమితి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
వెంటనే దరఖాస్తు చేసుకోండి
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. పరీక్షలో స్థానిక భాష పరిజ్ఞానం కూడా తప్పనిసరి. దరఖాస్తు రుసుము విషయానికొస్తే జనరల్, ఓబీసీ, EWS వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 750 రుసుము చెల్లించాలి. SC, ST, PWD వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు. అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా రుసుము చెల్లించవచ్చు.
ఇలా దరఖాస్తు చేసుకోండి
SBI కెరీర్స్ పేజీ sbi.co.in/web/careers ని సందర్శించండి.
“RECRUITMENT OF CIRCLE BASED OFFICERS” కింద ఉన్న అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీరే రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వండి.
వివరాలను ఫిల్ చేసి రుసుము చెల్లించాక ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.
భవిష్యత్తు అవసరాల కోసం ఈ ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్స్
యువతకు మైక్రోసాఫ్ట్ సూపర్ ఛాన్స్.. ఏఐ నుంచి డేటా సైన్స్
For Educational News And Telugu News