Share News

Osmania University: ఓయూలో వివాదాస్పదంగా మారిన హాస్టల్‌ వయో పరిమితి

ABN , Publish Date - Nov 26 , 2025 | 10:05 AM

ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో వయో పరిమితి అంశం రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. 28 ఏళ్లు దాటితే హాస్టల్‌ లేదని అధికారులు పేర్కొనడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Osmania University: ఓయూలో వివాదాస్పదంగా మారిన హాస్టల్‌ వయో పరిమితి

- 28 ఏళ్లు దాటితే హాస్టల్‌ లేదన్న అధికారులు

- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లో 28 ఏళ్లకు పైబడిన పీజీ విద్యార్థులకు హాస్టల్‌ వసతి నిరాకరించే నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. సీపీజీఈటీ నోటిఫికేషన్‌, కౌన్సిలింగ్‌ దశల్లో ఎక్కడా ప్రస్తావించని వయోపరిమితిని ఇప్పుడు అమలు చేయడం విద్యార్థుల్లో ఆగ్రహం రేపుతోంది. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లో లేని ఈ నిబంధనతో గ్రామీణ, పేద విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెబ్‌సైట్‌లో అధికారిక సమాచారం లేకుండా, తమ వద్దకు వచ్చినవారికే ఆర్డర్లు చూపిస్తూ అధికారులు తప్పించుకోవడం విద్యార్థులను మరింత కలవరపెడుతోంది. హాస్టల్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం దొరకడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ముందే చెప్పుంటే తాము ఇతర యూనివర్సిటీల్లో చేరే వాళ్లమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


city7.2.jpg

గ్రామీణ, పేద విద్యార్థులకే నష్టం..

ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ, పేద విద్యార్థులే ఎక్కువ మంది చదువుకునేందుకు వస్తుంటారు. కొంత మందికి పదో తరగతి పూర్తయ్యే సరికి 18 నుంచి 20 ఏళ్లు దాటిపోయి ఉంటాయి. బయట అద్దెలు కట్టే ఆర్థిక స్థోమత వారికి ఉండదు. వారందరికీ హాస్టల్‌కు వయోపరిమితి నిర్ణయం పెద్ద ఎదురు దెబ్బగా మారింది.


వయోపరిమితి రద్దు చేయాలి

సీపీజీఈటీలో అర్హత సాధించిన విద్యార్థులకు వయసుతో సంబంధం లేకుండా హాస్టల్‌ వసతి ఇవ్వాలి. పరీక్షలకు దరఖాస్తు చేసేముందు గానీ, కౌన్సెలింగ్‌లో గానీ ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. విద్యార్థులను మోసం చేసే ప్రయత్నమే ఇది.

- కొమ్మనబోయిన సైదుల యాదవ్‌, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్‌


స్కాలర్‌షిప్‌ అర్హులకు హాస్టల్‌ ఇస్తున్నాం

స్కాలర్‌షి్‌పకు అర్హులైన వారందరికీ హాస్టల్‌ ఇస్తున్నాం. రూల్‌ ప్రకారం స్కాలర్‌షి్‌పకు వయోపరిమితి 32 ఏండ్లు. కానీ 40 ఏండ్లు పైబడిన వాళ్లు కూడా డబుల్‌ పీజీలతో వస్తున్నారు. నిబంధనల ప్రకారం అలాంటి వాళ్లకు ఇవ్వడం లేదు.

- జి.శ్రీనివాసరావు, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌


ఈ వార్తలు కూడా చదవండి..

ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 10:05 AM