Indian Army Internship:ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:30 PM
Indian Army Internship 2025 Registration: సైన్యంలో పనిచేయాలని కోరుకునే యువతకు సువర్ణావకాశం. భారత సైన్యం 2025 ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IAIP)ని ప్రకటించింది. ఎంపికైన వారికి టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. డిగ్రీ మూడు, నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యారంటే..

Indian Army Internship 2025 Registration: మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలని కోరుకుంటుంటే నిజంగా ఇదో గొప్ప అవకాశం. భారత సైన్యం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IAIP) 2025 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు దేశ రక్షణ, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఈ ఇంటర్న్‌షిప్‌లో టెక్నాలజీ, ఫైనాన్స్, మాస్ మీడియా రంగాలలో 75 రోజుల హైబ్రిడ్ శిక్షణ అందిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి.
ఇండియన్ ఆర్మీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (IAIP) 2025 కింద మే 16 నుంచి ఢిల్లీ కాంట్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 25 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ మే 8, 2025. ఇంకొన్ని రోజులే గడువుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.
భారత సైన్యం అందిస్తున్న ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం ద్వారా యువత సైన్యంతో పనిచేసిన అనుభవంతో పాటు ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు సర్టిఫికేట్ కూడా పొందుతారు. ఇదే గాక ఇంటర్న్‌లకు భారత సైన్యంలో కెరీర్ అవకాశాలు పెరుగుతాయి. సీనియర్ ఆర్మీ అధికారులతో నేరుగా మాట్లాడే ఛాన్స్ లభిస్తుంది. వారి నుంచి నియామకాలు, ప్రాజెక్ట్ పరిశోధనలపై గైడెన్స్ తీసుకోవచ్చు.
ఇంటర్న్‌షిప్ వ్యవధి, విధానం
ఈ ఇంటర్న్‌షిప్ మే 16, 2025 నుంచి 30 జూలై 2025 వరకు కొనసాగుతుంది. 75 రోజుల శిక్షణలో మొదటి 60 రోజులు ఇంటర్న్‌లు భౌతికంగా పని చేయాల్సి ఉంటుంది. చివరి 15 రోజులు ఇంటర్న్‌షిప్ వర్చువల్ మోడ్‌లో ఉంటుంది. ఇంటర్న్‌షిప్ శిక్షణ ఢిల్లీలోని కాంట్‌లో జరుగుతుంది.
నమోదు
ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25, 2025 నుంచి మే 7, 2025 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో విద్యార్థుల దరఖాస్తులను మూల్యాంకనం చేసి వారి అర్హతలు, ఇంటర్న్‌షిప్ డొమైన్ మధ్య పోలికలను సరిచూస్తారు. రెండవ దశలో గూగుల్ మీట్ ద్వారా ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో విద్యార్థి నైపుణ్యాలు, ఆసక్తిని పరీక్షిస్తారు. చివరగా ఎంపికైన విద్యార్థుల జాబితాను మే 9, 10 తేదీలలో విడుదల చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెసేజ్ చేస్తారు.
వివిధ డొమైన్లు, రంగాలలో ఛాన్స్
ఈ కార్యక్రమం కింద ఎంపికైనవారికి టెక్నాలజీ రంగంలో డైరెక్టర్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ, సిగ్నల్స్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ అండ్ ఆప్టిమైజేషన్ గ్రూప్, డైరెక్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పదవులలో పనిచేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కింద, FIS ద్వారా ఫైనాన్షియల్ ఆటోమేషన్, ఫైనాన్స్ మ్యాపింగ్, బడ్జెట్ ప్లానింగ్, డేటా మైనింగ్/విశ్లేషణ వంటి రంగాలలో ఇంటర్న్‌షిప్ అందిస్తారు.
Read Also: ప్రతి అటెంప్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్