Share News

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

ABN , Publish Date - Jul 16 , 2025 | 09:44 AM

జేఎన్‌టీయూ వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది.

JNTU: ఆన్సర్‌షీట్లను దిద్దేందుకు ఆచార్యులు కరువు..

- జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’ ఫలితాల కోసం ఐదువేలమంది ఎదురుచూపు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) వన్‌టైమ్‌ చాన్స్‌లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం రెండు నెలలుగా ఎదురు చూపులు తప్పడం లేదు. వాస్తవానికి జూన్‌ నెలఖరులోగా ఫలితాలను ప్రకటించాలని వర్సిటీ ఉన్నతాధికారులు భావించగా, కొన్ని సబ్జెక్టులకు జవాబు పత్రాల మూల్యాంకనం చేసేందుకు ఆచార్యులు దొరకని పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. దీంతో ఫలితాల కోసం ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాల్సి వస్తోందనని అభ్యర్థులు వాపోతున్నారు.


వాస్తవానికి పదేళ్లకు ముందు ఇంజనీరింగ్‌, ఫార్మసీ, సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ యూజీ, పీజీ కోర్సులు చదివిన పూర్వ విద్యార్థులు తమ బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులను పూర్తి చేసుకునేందుకు జేఎన్‌టీయూ వన్‌టైమ్‌చాన్స్‌ పేరిట అదనపు అవకాశాన్నిచ్చింది. సుమారు ఐదువేలమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 25వేలకు పైగా ఆన్సర్‌షీట్లను మూల్యాంకనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


పరీక్షలు రాసిన వారిలో 20ఏళ్ల నాడు చదువుకున్న అభ్యర్థులు కూడా ఉండడం గమనార్హం. ఒకవైపు రెగ్యులర్‌ బీటెక్‌, ఎంటెక్‌, ఎం.ఫార్మసీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షలు, మరోవైపు వన్‌టైమ్‌ చాన్స్‌ పరీక్షలు ఒకేసారి జరగడంతో పరీక్షల విభాగం అధికారులు మూల్యాంకనం ఏవిధంగా చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.


city5.2.jpg

ఇంతకుముందు వన్‌టైమ్‌ చాన్స్‌లో బీటెక్‌, బీఫార్మసీ, ఎంటెక్‌, ఎంఫార్మసీ పరీక్షలు, మూల్యాంకనం వేర్వేరుగా నిర్వహించి ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రకటించగా, ప్రస్తుతం పరీక్షల విభాగం ఉన్నతాధికారులు వన్‌టైమ్‌చాన్స్‌ పరీక్షల ఫలితాలన్నీ ఒకేసారి ఇవ్వాలని భావించడంతో విద్యార్థులకు ఎదురుచూపు తప్పడం లేదు. ఉన్నతాధికారులు వన్‌టైమ్‌ చాన్స్‌ ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 16 , 2025 | 09:44 AM