JNTU: స్టార్టప్‌లపై కేంద్రం కొత్త పాలసీ
ABN , Publish Date - Jul 31 , 2025 | 07:24 AM
విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను, స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (ఫిట్) ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఐఐటీ ఢిల్లీ నుంచి జేఎన్‌టీయూకు వారు చేరుకున్నారు.

- ఆచార్యులు, విద్యార్థుల హర్షం
- ఇండస్ట్రీలకు చెందిన ప్రతినిధులతో ఫిట్ చర్చ
- జేఎన్‌టీయూలో బృందం పర్యటన
హైదరాబాద్ సిటీ: విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలను, స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమని ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (ఫిట్) ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఐఐటీ ఢిల్లీ నుంచి జేఎన్‌టీయూకు వారు చేరుకున్నారు. జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న స్టార్టప్స్, ఇండస్ట్రీలకు చెందిన ప్రతినిధులు, క్యాంపస్ కాలేజీలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులతో పాటు మార్గదర్శకుల (ఆచార్యుల)తో ప్రతినిధులు చర్చించారు.
అనంతరం జేఎన్‌టీయూలో ఉన్న బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో సమావేశం నిర్వహించిన ఢిల్లీ ఐఐటీ(IIT Delhi) ప్రతినిధుల బృందం తమ సర్వేలో భాగంగా స్టేక్‌హోల్డర్లతో చర్చించి, వారి సూచనలను స్వీకరించింది. విద్యార్థులకు మెరుగైన, సురక్షితమైన భవిష్యత్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురావాలన్న ఆలోచన పట్ల ఆచార్యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి అయోగ్ దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో సర్వే చేసే ప్రాజెక్టును ఐఐటీ-ఢిల్లీలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (ఫిట్) కు అప్పగించింది. కార్యక్రమంలో జేఎన్‌టీయూ స్టార్టప్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డైరెక్టర్ శ్రీదేవి, ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ రజిని, ఆర్‌అండ్‌డీ డైరెక్టర్ చెన్నకేశవరెడ్డి, క్వాలిటీ ఎస్యూరెన్స్ అండ్ అసె్‌సమెంట్ విభాగం డైరెక్టర్ గిరిధర్, ఐఐటీ ఢిల్లీ నుంచి మణిదీప్, మరికొందరు ఫిట్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం
Read Latest Telangana News and National News