Share News

SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:56 PM

SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. రాబోయే పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ విధానం మే 2025 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హాజరయ్యే సమయంలో అమలు చేస్తారని అధికారిక ప్రకటన జారీ చేసింది.

SSC Exam 2025: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కొత్త రూల్.. ఇది లేకపోతే పరీక్షకు నో ఎంట్రీ.. నోటీసు విడుదల
SSC Exam 2025 Important Notice

SSC Exam 2025 Important Notice: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) రాబోయే పరీక్షలలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణను అమలు చేయాలని నిర్ణయించింది. పరీక్షా ప్రక్రియను సులభతరం, సురక్షితం చేయడానికే ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ రూల్ ప్రకారం ఇకపై అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆన్‌లైన్‌లోనే ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అప్పుడే పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరయ్యేటప్పుడు ఆధార్ ద్వారా తమ గుర్తింపును నిరూపించుకునే అవకాశాన్ని పొందుతారు.


స్వచ్ఛంద ప్రాతిపదికన సర్టిఫికేషన్

ఈ ఆధార్ ఆధారిత సర్టిఫికేషన్ స్వచ్ఛందంగా ఉంటుంది. అంటే అభ్యర్థులే దానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యవస్థ పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందని అలాగే అభ్యర్థులకు సురక్షితమైన, అనుకూలమైన పద్ధతిని అందిస్తుందని కమిషన్ విశ్వసిస్తోంది.


ssc notice.png

మే నెల నుంచి అన్ని SSC పరీక్షల్లో అమలు

ఈ విధానం మే 2025 నుంచి అన్ని SSC పరీక్షలకు అమలు చేస్తారు. అభ్యర్థులు తమ గుర్తింపును నిర్ధారించుకోవడంలో, పరీక్ష సమయంలో ఎలాంటి మోసం జరగకుండా వారిని రక్షించుకోవడంలో సహాయపడుతుందని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తెలిపింది.


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌లో హవల్దార్ రిక్రూట్‌మెంట్ 2025, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 'సి' & 'డి' 2025 పరీక్షల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. ఇది కాకుండా సవరించిన పరీక్షల క్యాలెండర్‌ను త్వరలో కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తామని SSC తెలియజేసింది.


Read Also: Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్

NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. పూర్తి వివరాల

UGC NET June 2025: యూజీసీ నెట్ నోటిఫికేషన్

Updated Date - Apr 18 , 2025 | 01:57 PM