Google Jobs: డిగ్రీ చదివినవారూ Googleలో జాబ్ సాధించవచ్చు.. ఎలాగంటే?
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:05 AM
Google Careers for Graduates: ప్రపంచ టెక్ దిగ్గడం గూగుల్‌లో ఉద్యోగం సంపాదించడం యువతకు ఒక కల. అయితే, కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నవారికి మాత్రమే ఈ సంస్థలో ఉద్యోగం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కానీ, ఇదొక అపోహ మాత్రమే. నాన్-టెక్నికల్ విభాగంలో గ్రాడ్యుయేట్ అయినవారూ గూగుల్‌లో జాబ్ సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Google Jobs for Non-Technical People: గూగుల్ లాంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. జీతంపరంగా మాత్రమే కాదు. పని సంస్కృతి, ఉద్యోగులకు కల్పించే సౌకర్యాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టుల్లో భాగమవడం వల్ల సమాజంలో దక్కే గౌరవం.. ఇలా ఎన్నో అంశాలు ఈ సంస్థలో ఉద్యోగం సంపాదించాలనే కోరికను ప్రేరేపిస్తాయి. అయితే, కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీలు ఉన్నవారిని మాత్రమే గూగుల్ ఉద్యోగులుగా నియమించుకుంటుందనే అపోహ చాలామందికీ ఉంది. అతితక్కువ మందికే తెలిసిన విషయం ఏంటంటే, నాన్-టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారూ ఈ దిగ్గజ టెక్ కంపెనీలో జాబ్ పొందవచ్చు.
గూగుల్‌లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలకు నిర్దిష్ట సాంకేతిక డిగ్రీనే అవసరం లేదు. కొన్ని ఉద్యోగాలకు సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ అర్హత సరిపోతుంది. ప్రత్యేక లేదా సీనియర్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. చదువుపరంగా మంచి గ్రేడ్‌లు ఉన్న అభ్యర్థులకు గూగుల్ ప్రాధాన్యత ఇస్తుంది.
అర్హతలు ఏమిటి?
గూగుల్‌లోని చాలా ఉద్యోగాలకు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65% మార్కులు అవసరం. ముఖ్యమైన విషయం ఏంటంటే, 10వ తరగతి మొదలుకుని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకూ ఎక్కడా గ్యాప్ రాకూడదు. ఒక సంవత్సరం గ్యాప్ ఉన్నా మీరు గూగుల్‌కు అనర్హులు అవుతారు. అలాగే ఇంగ్లీష్‌పై కచ్చితంగా మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ సమయంలో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాత్రమే కాకుండా.. అభ్యర్థుల ఆలోచన తీరు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై కూడా గూగుల్ తప్పనిసరిగా దృష్టి పెడుతుంది.
1 నుంచి 2 నెలల ఇంటర్వ్యూ
గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలంటే కాస్త ఓపిక పట్టాల్సిందే. ఎందుకంటే, ఉద్యోగి ఎంపిక ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అనేక దశల్లో వడపోతలు పూర్తవ్వాలంటే కనీసం 1 నుంచి 2 నెలలు పడుతుంది. ఇందులో రెజ్యూమ్ స్క్రీనింగ్, రిక్రూటర్ కాల్స్, వర్చువల్ ఇంటర్వ్యూలు, ప్రాజెక్ట్ వర్క్ (కొన్ని ఉద్యోగాలకు), ఆన్‌సైట్ ఇంటర్వ్యూలు, నియామక కమిటీ, టీమ్ మ్యాచ్‌మేకింగ్ వంటి దశలు ఉంటాయి. నాన్-టెక్నికల్ జాబ్స్ కోసం వెళ్లేవారికి కొన్ని కేస్ స్టడీస్ లేదా అసైన్‌మెంట్‌లు ఇవ్వవచ్చు. ప్రాజెక్ట్ వర్క్‌లో సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారు.
నాన్-టెక్నాలజీ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ సమయంలో మీ కుటుంబ నేపథ్యం, అనుభవం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, Google గురించి ప్రశ్నలు అడుగుతారు. అందుకే ఇంటర్వ్యూకు ముందే దరఖాస్తు చేసుకున్న ఉద్యోగంపై సరైన పరిశోధన చేయడం చాలా అవసరం. మీరు STAR+R అంటే సిట్యుయేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ + రిఫ్లెక్షన్ అనే వ్యూహం ప్రకారం మీ సమాధానాలను సిద్ధం చేసుకుంటే.. అప్పుడు Googleలో మీరు ఉద్యోగిగా ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గూగుల్ దరఖాస్తుదారుల ఈ నాలుగు ముఖ్య లక్షణాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించిన కనీస పరిజ్ఞానం, అనుభవం, నాయకత్వం, గూగుల్‌నెస్, ఉంటే ఎంట్రీ చాలా ఈజీ.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
Googleలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వారి అధికారిక కెరీర్‌ల వెబ్‌సైట్ careers.google.com కు వెళ్లండి. ఇక్కడ మీరు మీ నైపుణ్యాలు, అర్హతలు, అనుభవం ఆధారంగా ఉద్యోగాల కోసం శోధించి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు విద్యార్థి లేదా ఇటీవల గ్రాడ్యుయేట్ అయితే Googleలో ఇంటర్న్‌షిప్‌లు, ప్రారంభ కెరీర్ కోసం మంచి అవకాశాలను ఫైండ్ చేయవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ అర్హతతో SBIలో ఆఫీసర్ అయ్యే ఛాన్స్.. 2600లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
DRDOలో రీసెర్చ్ ఫెలోషిప్‌గా చేరేందుకు మంచి ఛాన్స్.. స్టైఫండ్ ఏకంగా రూ.37 వేలు..
For Educational News And Telugu News