Share News

Schools: ఇక.. ఆలస్యమైతే ఆబ్సెంటే..

ABN , Publish Date - Aug 01 , 2025 | 08:10 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి తెలంగాణ విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్ ను అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.

Schools: ఇక.. ఆలస్యమైతే ఆబ్సెంటే..

- నేటి నుంచి పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌

- తొలిరోజు యాప్‌లో ఉపాధ్యాయుల వివరాల రిజిస్ర్టేషన్‌

- మరుసటి రోజు నుంచి సెల్‌ఫోన్లలో అటెండెన్స్‌

- సమయపాలన పాటించని టీచర్లకు ముకుతాడు

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి తెలంగాణ విద్యాశాఖ ఎఫ్‌ఆర్‌ఎస్ ను అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 16 మండలాల్లో 713 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో సుమారు 1,15,660 మంది చదువుతున్నారు. వీరికి 6,613 మంది ఉపాధ్యాయులు బోధనలు అందిస్తున్నారు.


పలు స్కూళ్లలో ఇష్టారాజ్యం

జిల్లాలోని పలు స్కూళ్లలో పనిచేస్తున్న కొందరు టీచర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ విధులకు హాజరుకావడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగులని, డీఈఓ ఆఫీ్‌సలో పని ఉందని చెబుతూ.. నెలలో వారానికి పైగా డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారికి ఇపుడు ముకుతాడు పడనుంది. పెద్దపల్లి జిల్లాలో కొన్ని నెలలుగా పైలెట్‌ ప్రాజెక్టుగా నిర్వహించిన కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.


తొలిరోజు యాప్‌లో పేర్లు రిజిస్ర్టేషన్‌

పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థులకు మాత్రమే ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా అటెండెన్స్‌ను తీసుకుంటున్నారు. ఈ విధానంలో హైదరాబాద్‌ జిల్లా ఇటీవల రాష్ట్రస్థాయిలో తొలిస్థానంలో నిలిచింది. జిల్లాలో ముఖ గుర్తింపు నమోదు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత 93వేల మంది విద్యార్థులున్నారు. అయితే ఇటీవల మరోసారి పరిశీలిస్తే 92 వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, వీరితోపాటు ఇటీవల మరో 23,660 మంది కొత్త విద్యార్థులు చేరారు. వారంతా యాప్‌లో నమోదు కాలేదని తెలిసింది.


city4.jpg

ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ లో తమ అటెండెన్స్‌ను వేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌లో జియో ట్యాగింగ్‌ ఉండడంతో టీచర్‌ ఎక్కడున్నాడో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా కచ్చితంగా పనివేళలు ముగిసే వరకు స్కూల్‌లో ఉండనున్నారు. ఇదిలా ఉండగా, ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియలో భాగంగా తొలిరోజు శుక్రవారం టీచర్లు ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను లాగవుట్‌ చేయాలని అధికారులు సూచించారు. తిరిగి లాగిన్‌ కావడానికి యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేపట్నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ షురూ

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 08:10 AM