Share News

CBSE Results 2025: సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

ABN , Publish Date - May 12 , 2025 | 12:56 PM

CBSE Results 2025 Live: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. మరి.. ఏ వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

CBSE Results 2025: సీబీఎస్ఈ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
CBSE Results 2025

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఎప్పటిలాగే మే నెల రెండో వారంలోనే రిజల్ట్స్‌ను అనౌన్స్ చేశారు. ఇవాళ ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. ఈ ఏడాది టెన్త్ క్లాస్ రిజల్ట్స్‌లో 93.60 ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్0.06 శాతం పెరిగింది. ఈసారి 2.37 శాతం తేడాతో అబ్బాయిలను అమ్మాయిలు అధిగమించారు. పరీక్షలు రాసినవారిలో 95 శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. అటు 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా విజయవాడ రీజియన్‌లో 99.60 శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. ఆ తర్వాత తిరువనంతపురంలో 99.32 శాతం, చెన్నైలో 97.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 0.41 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మరి.. సీబీఎస్ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


చెక్ చేసుకోండిలా..

  • సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలను ఈ అధికారిక వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు.

  • cbse.gov.in

  • cbseresults.nic.in

  • results.cbse.nic.in

  • రిజల్ట్స్‌ను మీ ఫోన్ నుంచి కూడా తెలుసుకోవచ్చు.

  • మీ మొబైల్‌లో CBSE10 లేదా CBSE12 (రోల్ నంబర్) (స్కూల్ నంబర్) (సెంటర్ నంబర్) ఎంటర్ చేయాలి.

  • 77382 99899 నంబర్‌కు ఈ మెసేజ్ పంపాలి.

  • ఆ తర్వాత రిజల్ట్స్‌ను మెసేజ్ రూపంలో అందుకుంటారు.


ఇవీ చదవండి:

ఎస్బీఐలో 2,964 ఉద్యోగాలకు నోటిఫికేషన్..

సాధారణ పౌరులకు ఆర్మీలో చేరే ఛాన్స్

ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌.. ఎవరు అర్హులంటే..!

మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 01:35 PM