CAT 2025: నేడు CAT పరీక్ష.. అభ్యర్థులకు కీలక సూచన
ABN , Publish Date - Nov 30 , 2025 | 08:20 AM
CAT 2025 పరీక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒకే రోజు మూడు షిప్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పలు కీలక సూచనలు.
న్యూఢిల్లీ, నవంబర్ 30: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఈ రోజు అంటే.. నవంబర్ 30వ తేదీ ఆదివారం జరగనుంది. ఈ పరీక్ష మూడు షిప్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ 8:30 నుంచి 10.30 గంటల వరకు.. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు.. మూడో షిఫ్ట్ సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటలకు వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. తమ అడ్మిట్ కార్డును పరీక్షా కేంద్రానికి తప్పని సరిగా తీసుకు వెళ్లాలి. ఆ కార్డులో సూచించిన సమయానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. CAT 2025 అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు IIM CAT పోర్టల్‌లోకి వెళ్లి.. iimcat.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
CAT 2025 పరీక్ష మార్గదర్శకాలు ఇవిగో..
రిపోర్టింగ్ సమయం..
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట నుంచి గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుని.. రిపోర్ట్ చేయాలి. CAT పరీక్ష ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది. అంటే.. అభ్యర్థులు ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉదయం 11.30 గంటలకు పరీక్ష కేంద్రం వద్ద ఉండాలి. సాయంత్రం 4.30 గంటలకు పరీక్ష అంటే.. 4 గంటలకు పరీక్ష కేంద్రం వద్ద ఉండాలి.
అడ్మిట్ కార్డు..
అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డు తీసుకెళ్లాలి. ఈ కార్డు లేకుంటే.. పరీక్ష రాసేందుకు అనుమతించరు.
వీటిని సైతం..
CAT అడ్మిట్ కార్డుతోపాటు.. ఏదైనా గుర్తింపు కార్డు.. అది కూడా ప్రభుత్వం జారీ చేసినవి అయి ఉండాలి. వాటిని తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే.. ఫోటో ఐడీ పాన్, ఓటర్ కార్డును తప్పని సరిగా తీసుకు వెళ్లాలి.
ఇవి నిషేధం..
పరీక్షా కేంద్రానికి అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలు.. అంటే స్మార్ట్ ఫోన్, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్లు, పేజర్లను అనుమతించరు. ఒక వేళ తీసుకు వెళ్లితే మాత్రం.. ఆయా వస్తువులను పరీక్ష కేంద్రం బయట వదలాల్సి ఉంటుంది.
డ్రస్ కోడ్..
పురుష అభ్యర్థులు సాధారణ ప్యాంట్, జీన్స్‌తోపాటు పాదాలకు చెప్పులు ధరించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు లెగ్గింగ్స్, ట్రౌజర్లు ధరించాలి. సాధారణ చెప్పులు ఎంచుకోవాలి.
మరిన్ని వివరాలు కోసం..
IIM CAT వివరాల కోసం.. iimcat.ac.inని సందర్శించాలి
ఈ వార్తలు కూడా చదవండి..
ఓయూలో వివాదాస్పదంగా మారిన హాస్టల్ వయో పరిమితి
‘పది’పై పరేషాన్.. ఆ టీచర్లకు పరీక్షే..
Read Latest Education News and National News