Jobs in Railways: ఇదే టైం! రైల్వే భారీ నోటిఫికేషన్.. 50 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:26 PM
నిరుద్యోగులకు మంచిఛాన్స్. 2025-26 సంవత్సరానికి గానూ ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 50,000లకు పైగా పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. అభ్యర్థులకు సమీపంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులుర, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

RRB Recruitment 2025: భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందేందుకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ పోస్టులకు నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, RRB 2025-26 సంవత్సరంలో మొత్తం 50,000 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే 9000 మందికి పైగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక లేఖలను పంపింది. కాగా, నవంబర్ 2024 నుంచి ఇప్పటివరకు 55,197 పోస్టులకు ఏడు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం మొత్తం 50,000 పోస్టులను భర్తీ చేయనుంది. అలాగే బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2024 నుండి ఇప్పటివరకూ 55197 పోస్టులకు ఏడు వేర్వేరు నోటిఫికేషన్ల కింద 1.86 కోట్లకు పైగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించారు. ఇది కాకుండా RRB ప్రకారం, 2024లో 1,08,324 పోస్టులకు ఇప్పటికే మొత్తం పన్నెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా RRB మొత్తం 50,000 పోస్టులను భర్తీ చేయనుంది.
ఇళ్ల దగ్గరే పరీక్ష
RRB పరీక్షలకు CBT నిర్వహించడం చాలా పెద్ద ప్రక్రియ అని.. దీనికి విస్తృతమైన ప్రణాళిక, సమన్వయం అవసరమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. RRB అభ్యర్థుల ఇళ్ల దగ్గర పరీక్షా కేంద్రాలను కేటాయించడానికి చొరవ తీసుకుందని మహిళలు, దివ్యాంగులకు (PwBD) ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. పరీక్షను న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించడానికి మరిన్ని పరీక్షా కేంద్రాలను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
2026-27లో 50వేల కంటే ఎక్కువ నియామకాలు
రైల్వే మంత్రిత్వ శాఖ వార్షిక క్యాలెండర్ ప్రకారం చూస్తే, 2024 నుంచి ఇప్పటివరకు 1,08,324 పోస్టులకు RRB 12 నోటిఫికేషన్లు జారీ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో 50,000 కంటే ఎక్కువ నియామకాలు చేపట్టే అవకాశముంది.
ఆధార్ కార్డు ద్వారా అభ్యర్థులను గుర్తింపు
పరీక్షల నిష్పాక్షికతను పెంచడానికి RRB ఒక కొత్త చొరవ తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారిగా, అభ్యర్థులను గుర్తించడానికి e-KYC ఆధారిత ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉపయోగిస్తారు. ఇది 95 శాతానికి పైగా సక్సెస్ రేటును ఇచ్చింది. దీనితో పాటు మోసాలను నివారించడానికి అన్ని పరీక్షా కేంద్రాలలో 100% జామర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఎవరూ ఎలక్ట్రానిక్ పరికరాన్ని దుర్వినియోగం చేయలేరు. రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నవంబర్ 2024 నుంచి 55,197 పోస్టులకు ఏడు వేర్వేరు నోటిఫికేషన్‌లను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ల కింద 1.86 కోట్లకు పైగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBTలు) నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి