Tirumala Darshan: ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ.300 టిక్కెట్ లభించకపోతే ఇలా ట్రై చేయండి!
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:59 PM
ఆగస్టులో కుటుంబసమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి. ఆఖరి నిముషంలో రూ.300 టికెట్లు అన్నీ అమ్ముడుపోయినా మరో మార్గముంది. ఇలా ప్రయత్నిస్తే కోరుకున్నట్టుగా నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.

Tirumala Darshan Ticket: ఆగస్టులో కుటుంబసమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి. ఎందుకంటే, ఆఖరి నిముషంలో రూ.300 టికెట్లు అన్నీ అమ్ముడుపోయినా మరో మార్గముంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకుంటే భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా కోరుకున్న విధంగా స్వామి దర్శనం పొందే అవకాశం లభిస్తుంది. ఆగస్టు నెలలో నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇలా చేయండి.
తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఏడాది పొడుగునా భక్తులు పెద్ద ఎత్తున తరలివెళుతుంటారు. శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కిక్కిరిసిపోతూనే ఉంటుంది. అందుకే సంవత్సరంలో ఏ సమయంలో అయినా స్వామి వారి దర్శన టికెట్లకు డిమాండ్ ఉంటుంది. ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చెయ్యాలి అనుకున్నప్పటికీ.. దర్శన టికెట్లు లభించలేదనే కారణంతో వాయిదా వేసుకోవాలని అనుకునేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక శుభవార్త తెలిపింది. రూ.300 టికెట్ దొరక్కపోయినా ఈ మార్గంలో ప్రయత్నిస్తే కచ్చితంగా, వేగంగా దర్శనం చేసుకోవచ్చు.
ప్రస్తుతం దైవ దర్శనం కోసం చాలామంది ట్రిప్ కు ముందే ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుంటారు కాబట్టి దర్శనం టికెట్లకు తీవ్ర డిమాండ్ ఉంటుంది. అందుకే చాలాసార్లు త్వరత్వరగా టికెట్లు బుక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు నిరాశపడకుండా ఇలా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచిస్తోంది. ఆగస్టు నెలలో రూ.300 టికెట్లు కొనుగోలు చేసేందుకు లభించకపోతే కాస్త ఎక్కువ ఖర్చయినా ఈ మార్గంలో ప్రయత్నించండి.
ఈ జూలై 25 వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ తన అధికారిక వెబ్ సైట్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం పేరిట టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో ఒక్క టికెట్ ఖరీదు రూ.1600. ఇద్దరు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న రోజున ఉదయం 9 గంటల లోపే అలిపిరికి వెళ్లాలి. అక్కడ ఉన్న సప్త గృహ దగ్గర రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 11 గంటల లోపు అక్కడ హోమం పూర్తయిపోతుంది. తర్వాత అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు.
Also Read:
ఈ రాశి వారికి లక్ష్య సాధనలో తోబుట్టువుల సహకారం లభిస్తుంది
ఈ రాశి వారికి మార్పులు బదిలీలు కొంత అసౌకర్యం కలిగిస్తాయి
For More Devotional News And Telugu News