Share News

Hyderabad: మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

ABN , Publish Date - Apr 25 , 2025 | 08:48 AM

మీ వీడియో నా దగ్గరుంది.. అది బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వండి.. అంటూ ఓ ఎమ్మెల్యేను యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌ బ్లాక్‌మెయిల్‌ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన వారు అతడిని అరెస్టు చేశారు.

Hyderabad: మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..

- జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌ బ్లాక్‌మెయిల్‌

- పోలీసులకు ఫిర్యాదు. నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్: ఓ సున్నితమైన వీడియో తన దగ్గర ఉందని, అది బయటపెడితే ఇబ్బందుల్లో పడతారంటూ ఓ ఎమ్మెల్యేను ఓ యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టరు బెదిరించాడు. ఆ వీడియో బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సదరు యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం... హైదరాబాద్‌ సన్‌సిటీ మ్యాపిల్‌ టౌన్‌షిప్‌(Hyderabad Suncity Maple Township)లో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నివాసం ఉంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: స్మితా సబర్వాల్‌కు దానం సంఘీభావం..


ఈ నెల 15న ఆయనకు మేనం శ్యామ్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి.. తనను తాను ‘ప్రజావాయిస్‌ న్యూస్‌ చానల్‌’ జర్నలిస్టునని పరిచయం చేసుకున్నాడు. ‘మీకు సంబంధించిన ఓ వీడియో నా దగ్గర ఉంది.’ అని ఆయనకు చెప్పాడు. అదే రోజు రాత్రి 7:30కు హైదర్‌గూడ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు తన అనుచరులతో కలిసి మేనం శ్యామ్‌ వెళ్లి... ఓ మహిళ తనకు వీడియో ఇచ్చిందని, అది సోషల్‌ మీడియాలో పెడితే రాజకీయంగా మీకు నష్టం జరుగుతుందని, అలా చేయకుండా ఉండాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని లక్ష్మీకాంతరావును బెదిరించాడు.


city3.2.jpg

ఆ తర్వాతా మేనం శ్యామ్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుండటంతో ఈనెల 22న తోట లక్ష్మీకాంత రావు రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐ క్యాస్ర్టో బుధవారం మేనం శ్యామ్‌ను సురారం క్రిష్ణానగర్‌లో అరెస్ట్‌ చేశారు. అతడిని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపర్చగా న్యాయ మూర్తి, స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వొచ్చునని సూచించడంతో 41 సీఆర్‌పీ కింద నోటీసులిచ్చి వదిలిపెట్టారు. అయితే తాను ఎమ్మెల్యేను డబ్బులు అడగలేదని మేనం శ్యామ్‌ పేర్కొన్నాడు. ఓ మహిళ తన వద్దకొచ్చి.. తోట లక్ష్మీకాంతరావు తనను మోసం చేశాడని చెప్పిందని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యేతో చెప్పానన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ భద్రతపై కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు

పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!

కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 25 , 2025 | 08:48 AM