Share News

Software Engineer: ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

ABN , Publish Date - Jul 24 , 2025 | 08:38 AM

ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయిస్తూ హెచ్‌న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌.

Software Engineer: ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసై స్మగ్లర్‌గా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

- పోలీసులకు చిక్కి కటకటాలపాలు

హైదరాబాద్‌ సిటీ: ప్రేమ విఫలమై.. డ్రగ్స్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారాడు. గోవాకు వెళ్లి డ్రగ్స్‌ కొనుగోలు చేసి, హైదరాబాద్‌(Hyderabad)లో విక్రయిస్తూ హెచ్‌న్యూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కథనం ప్రకారం.. గాజులరామారానికి చెందిన హర్షవర్థన్‌(Harshvardhan) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ప్రేమలో విఫలం కావడంతో స్నేహితులతో కలిసి పబ్‌లకు వెళ్లేవాడు. అతడికి ఓజీ కుష్‌ (గంజాయి) అలవాటైంది.


city3.2.jpg

తర్వాత కొకైన్‌ అలవాటు చేసుకున్నాడు. దానికోసం గోవా, బెంగళూరు వెళ్లేవాడు. అక్కడ నైజీరియన్‌ స్మగ్లర్స్‌(Nigerian Smugglers)తో పరిచయం పెంచుకుని తానూ స్మగ్లర్‌గా మారాడు. నగరంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నాడు. హెచ్‌న్యూ పోలీసులు బొల్లారం పరిధిలో హర్షను అరెస్టు చేశారు. రూ.3.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2025 | 08:38 AM