Cyber Criminals: ట్యాక్స్ పేయర్లే టార్గెట్.. ఐటీ రిటర్న్ అంటూ ఫిషింగ్ మెయిల్స్
ABN , Publish Date - Jul 22 , 2025 | 08:49 AM
ఇన్‌కం టాక్స్ పేయర్లను టార్గెట్ చేసిన కొన్ని సైబర్ ముఠాలు, ఐటీ రిటర్న్ పేరుతో ఫిషింగ్ మొయిల్స్‌ను పంపి మోసాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్ అంటూ లింక్‌తో కూడిన మెయిల్ వస్తే అది కచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు.

- సైబర్ మోసాలపై అలర్ట్‌గా ఉండాలి
హైదరాబాద్ సిటీ: ఇన్‌కం టాక్స్ పేయర్లను టార్గెట్ చేసిన కొన్ని సైబర్ ముఠాలు, ఐటీ రిటర్న్ పేరుతో ఫిషింగ్ మొయిల్స్‌ను పంపి మోసాలకు తెగబడుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి సూచిస్తున్నారు. ఐటీ రిటర్న్ అంటూ లింక్‌తో కూడిన మెయిల్ వస్తే అది కచ్చితంగా మోసమని గుర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లింక్‌ను తెరవద్దని హెచ్చరిస్తున్నారు. ఇన్‌కంట్యాక్స్ రీఫండ్ కోసం లింక్‌లతో కూడిన మెయిల్స్‌ను అధికారులు ఎట్టి పరిస్థితుల్లో పంపించరని గుర్తుంచుకోవాలన్నారు. ఐటీ రిటర్న్ కోసం పిన్ నెంబర్, పాస్‌వర్డ్ తదితర వివరాలు అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మెయిల్స్‌ను క్లిక్ చేయొద్దు..
సైబర్ నేరగాళ్లు ఆదాయపన్ను చెల్లించేవారిని సమాచారాన్ని సేకరించి, వారికి ఆదాయపన్ను రీఫండ్ చేసుకోవాలంటూ మెయిల్స్‌ను పంపుతున్నారు. మీ ఆదాయపన్ను ముదింపు జరిగిన తర్వాత మీకు కొంత మొత్తం రీఫండ్ అయిందని, ఈ డబ్బు మీ ఖాతాలో జమ కావాలంటే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని లింక్‌ను మెయిల్ ద్వారా పంపుతున్నారు. టాక్స్ రీఫండ్ ఆన్‌లైన్ ఫామ్ పేరుతో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే ఇన్‌కంటాక్స్ శాఖ వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతోంది. ఈ వెబ్‌పేజ్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేస్తే, మీ ఖాతాలో 24 గంటల్లో ఐటీ రిటర్స్ మొత్తం జమ అవుతుందని సందేశాలు పంపుతారు. ఇలాంటి ఫిషింగ్ మెయిల్స్, లింక్‌ల ద్వారా మాల్‌వేర్‌ను జొప్పించిన సైబర్ నేరగాళ్లు ఆ తర్వాత ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఐటీ రిటర్న్ పేరుతో సైబర్ నేరగాళ్లు పంపే యూఆర్‌ఎల్ లింక్‌లను కాపీ పేస్ట్ చేయకూడదు. ఇతరులకు పంపవద్దు. ఫోన్, కంప్యూటర్‌ను ఎప్పటికప్పుడు యాంటీ వైర్‌సతో స్కాన్ చేయాలి. ఐటీ చెల్లింపులు, రిటర్న్‌లు అధీకృత వెబ్‌సైట్ ద్వారానే చేయాలి. తరచూ పాస్‌వర్డ్‌లు మార్చాలి. బ్యాంకు ఖాతాలకు టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. తరచూ ఇలాంటి మెయిల్స్ వస్తుంటే వెంటనే సైబర్ క్రైం అధికారులకు సమాచారమందించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest Telangana News and National News