Secunderabad: కుంభమేళా నుంచి అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదం..
ABN , Publish Date - Feb 01 , 2025 | 07:10 AM
కుంభమేళా నుంచి అయోధ్య(Ayodhya) వెళుతుండగా పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని హెచ్‌బీ కాలనీ డివిజన్(HB Colony Division)కు చెందిన కుర్వ రామాంజనేయులు(35) మృతిచెందారు.

- హెచ్‌బీ కాలనీ వాసి మృతి
సికింద్రాబాద్: కుంభమేళా నుంచి అయోధ్య(Ayodhya) వెళుతుండగా పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరంలోని హెచ్‌బీ కాలనీ డివిజన్(HB Colony Division)కు చెందిన కుర్వ రామాంజనేయులు(35) మృతిచెందారు. డివిజన్‌లోని న్యూనర్సింహనగర్ నుంచి ఈనెల 27న 22 మందితో కలిసి ఆయన కుంభమేళా, వారణాసి, అయోధ్య యాత్రకు వెళ్లారు. బుధవారం మౌని అమవాస్యరోజున కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసి అక్కడినుంచి అయోధ్యకు బయలుదేరారు.
ఈ వార్తను కూడా చదవండి: Special trains: మహా కుంభమేళాకు ఆరు ప్రత్యేకరైళ్లు..
గురువారం తెల్లవారుజామున పాట్నా(Patna) వద్ద వీరి బస్సు ముందువెళుతున్న టిప్పర్‌ను డీకొట్టింది. డ్రైవర్ పక్కన ముందుసీటులో కూర్చున్న రామాంజనేయులు(Ramanjaneyas) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) అక్కడి అధికారులతో మాట్లాడారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఫ్లైట్‌లో శుక్రవారం మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చారు. సాయంత్రం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News