YouTube: వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించిన యూట్యూబ్
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:23 PM
ఏఐ యుగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌ల సునామీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా తామంతట తామే బయటకు వెళ్లేందుకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ను ప్రకటించింది. దీంట్లో భాగంగా సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ యుగం రావడంతో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌ల సునామీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. ఉద్యోగులను తొలగించకుండా స్వచ్ఛందంగా తామంతట తామే బయటకు వెళ్లేందుకు వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ను ప్రకటించింది. దీంట్లో భాగంగా సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.
‘పదేళ్లలో తొలిసారిగా యూట్యూబ్ ప్రొడక్ట్ విభాగాన్ని పూర్తిగా పునర్మిస్తున్నాం. ఏఐ ఆధారంగా యూజర్ అనుభవాన్ని మెరుగుపర్చే దిశగా ముందుకు సాగుతున్నాం. అందుకోసం బలవంతపు తొలగింపులు చేయడం లేదు. తమ కెరీర్‌ను మార్చుకోవాలనే ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలు అందిస్తున్నాం. ఇవి ముఖ్యంగా అమెరికాలో పనిచేస్తున్న సిబ్బందికే వర్తిస్తాయి’ అని పేర్కొన్నారు. అయితే కంటెంట్ క్రియేషన్, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏఐ పాత్రను దృష్టిలో ఉంచుకుని వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
ఏఐతో కొత్త దశకు యూట్యూబ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థలు ఏఐ ఆధారిత మోడళ్లను అమలు చేస్తున్నాయి. యూ ట్యూబ్ కూడా అదే దారిలో అడుగుపెడుతోంది. కంటెంట్ క్రియేషన్, ఎడిటింగ్, సబ్ టైటిలింగ్, కంటెంట్ మోనిటైజేషన్‌లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడానికి యూట్యూబ్ చర్యలు చేపట్టింది. దీంతో ఏఐ ఆధారంగా యూజర్ ప్రిఫరెన్స్ గుర్తించడం, వీడియో సిఫార్సులు మరింత కచ్చితంగా ఇవ్వడం వంటి మార్పులు త్వరలోనే అమలులోకి రానున్నాయి.
ఉద్యోగుల భవిత్యంపై ప్రశ్న!
వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ అంటూ సంస్థ వినూత్నంగా ఆలోచించినప్పటికీ ఉద్యోగుల కెరీర్‌పై ఇది ప్రభావం చూపుతుంది. కొంత మంది ఉద్యోగులు తమ భవిష్యత్తు పట్ల ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు, ఏఐ ఆధారిత నూతన అవకాశాలు, క్రియేటివ్ రంగంలో కొత్త జాబ్ రోల్స్ లభిస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.