Top Mutual Funds: గత ఐదేళ్లలో అత్యధిక రాబడిని ఇచ్చిన టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్
ABN , Publish Date - Aug 04 , 2025 | 10:51 AM
అనేక మంది కూడా వారి డబ్బు వేగంగా పెరగాలని ఆశిస్తారు. అదే కోరికతో మ్యూచువల్ ఫండ్స్ వైపు ఆసక్తి చూపిస్తారు. అలాంటి వారికి ఉపయోగపడే టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇక్కడ చూద్దాం.

మనలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణం డబ్బు త్వరగా పెరగాలని కోరుకోవడమే. ఒత్తిడి లేకుండా లాభాలు వచ్చేలా ఉండాలని భావిస్తుంటారు. కానీ అనేక మందికి కూడా ఎలాంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలనే విషయాలు తెలియవు. అయితే AMFI (అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా) జూలై 31, 2025 డేటా ప్రకారం, గత ఐదేళ్లలో మంచి రాబడి ఇచ్చిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ (Top 3 Mutual Funds) గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. స్మాల్ క్యాప్ - క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
ఒకవేళ మీరు భారీ రాబడితోపాటు మార్కెట్‌లో హెచ్చుతగ్గులను తట్టుకోగలిగితే ఈ ఫండ్ మీకు సరిపోతుంది. గత ఐదేళ్లలో ఈ ఫండ్ ఏకంగా 40.17% వార్షిక రాబడిని ఇచ్చింది. దీని బెంచ్‌మార్క్ (నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 TRI) అదే కాలంలో 32.74% ఇచ్చింది. అంటే, ఈ ఫండ్ తన బెంచ్‌మార్క్‌ను దాటి అద్భుతంగా పనిచేసింది. కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా రిస్క్‌తో కూడుకున్నవనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ఫండ్ ఎంచుకునేవారు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి.
2. మిడ్ క్యాప్ - మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్
మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే కొంత మందికి అంత ఆకర్షణగా కనిపించకపోవచ్చు. కానీ మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ గత ఐదేళ్లలో సంవత్సరానికి 36.52% రాబడిని ఇచ్చింది. దీని బెంచ్‌మార్క్ (నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 TRI) 30.42% ఇచ్చింది. అంటే, ఈ ఫండ్ తన బెంచ్‌మార్క్‌ను దాటేసింది. స్మాల్ క్యాప్స్ కంటే దీనిలో కూడా కొంచెం రిస్క్ తక్కువగా ఉంటుంది.
3. లార్జ్ క్యాప్ - నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్
లార్జ్ క్యాప్ ఫండ్స్‌ను సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. ఎందుకంటే, ఇవి రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద, బలమైన కంపెనీల్లో పెట్టుబడులు చేస్తాయి. ఈ ఫండ్ గత ఐదేళ్లలో సంవత్సరానికి 26.21% రాబడిని ఇచ్చింది. దీని బెంచ్‌మార్క్ (BSE 100 TRI) 19.94% ఇవ్వడం విశేషం. కాబట్టి, మీరు స్థిరమైన రాబడి కావాలని చూస్తూ, ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే ఈ ఫండ్ బెటర్. అయినా, SEBI దీన్ని కూడా రిస్క్‌తో కూడినదిగా గుర్తించింది. ఎందుకంటే ఇది ఈక్విటీ ఫండ్.
ఏ ఫండ్ ఎంచుకోవాలి?
కొందరు భారీ లాభాల కోసం రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరికొందరు స్థిరమైన రాబడి కోసం చూస్తారు. ఈ మూడు ఫండ్స్ గత ఐదేళ్లలో తమ రాబడులను నిలబెట్టుకున్నాయి. కానీ, మీరు మీ సౌకర్యం, రిస్క్ తీసుకునే స్థాయి ఆధారంగా ఫండ్ ఎంచుకోవాలి.
గమనిక: స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. మీకు పెట్టుబడి చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి