Share News

Kakinada: కాకినాడలో దారుణం.. భార్యభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు

ABN , Publish Date - Aug 04 , 2025 | 10:13 AM

కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. కొన్నేళ్ళుగా సహజీవనం చేసిన మహిళ తిరిగి తన భర్తను చేరుకోవడంతో..

Kakinada: కాకినాడలో దారుణం.. భార్యభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు
Kakinada

కాకినాడ: ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెదమల్లాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా సహజీవనం చేసిన మహిళ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవడంతో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. నాటు తుపాకీతో ఇద్దరిపై కాల్పులకు తెగపడ్డాడు. అసలేం జరిగిందంటే..


పెదమల్లాపురానికి చెందిన ఓ మహిళ గతంలో నిందితుడితో సహజీవనం చేసింది. అయితే, ఇటీవల ఆమె మళ్లీ తన మొదటి భర్త వద్దకు వెళ్లిపోయింది. దీంతో నిందితుడు ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో, శనివారం రాత్రి దుండగుడు వీరి ఇంట్లోకి ప్రవేశించి భార్యభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.


ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ స్వల్పగాయాలు అయ్యాయి. గాయాలైన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు వారికి ప్రాణాపాయం లేదని తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.


Also Read:

శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?

వర్షాకాలంలో ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఏ వ్యాధి మీ దగ్గరకు రాదు.!

Updated Date - Aug 04 , 2025 | 10:32 AM