Share News

Andy Jassy: బాంబు పేల్చిన అమెజాన్ సీఈవో.. వాళ్ల ఉద్యోగాలు ఊస్ట్

ABN , Publish Date - Mar 06 , 2025 | 11:34 AM

Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పలు రకాల ఉద్యోగాలకు కత్తెర వేయాలని సీఈవో ఆండీ జస్సీ డిసైడ్ అయ్యారు. వాళ్ల ఉద్యోగాలు ఇక ఊస్టేనని క్లారిటీ ఇచ్చారు.

Andy Jassy: బాంబు పేల్చిన అమెజాన్ సీఈవో.. వాళ్ల ఉద్యోగాలు ఊస్ట్
Amazon CEO Andy Jassy

అమెజాన్‌‌లో భారీ కోతలు తప్పవని ఆ సంస్థ సీఈవో ఆండీ జస్సీ స్పష్టం చేశారు. కంపెనీలో భారీ మార్పులు చేస్తున్నామని.. ఉద్యోగుల వ్యవస్థను మొత్తం మార్చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మిడిల్ మేనేజ్‌మెంట్‌ను తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మిడిల్ మేనేజ్‌మెంట్‌‌ను క్రమంగా తగ్గించుకుంటూ పోతామని.. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు ఇది దోహదపడుతుందన్నారు ఆండీ జస్సీ. మేనేజ్‌మెంట్ లెవల్‌లో ఉన్న కొన్ని సమస్యల వల్ల కీలక నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతోందన్నారు.


బాధ్యతలన్నీ వారికే..

ఎక్కువ మందిని చేర్చుకుంటూ పోవడం వల్ల మిడిల్ మేనేజర్స్‌తో సంస్థ నిండిపోతోందన్నారు ఆండీ జస్సీ. ఆ మిడిల్ మేనేజర్స్ తమ పని తాము చేసుకొని ఊరుకోకుండా.. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆయన సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ వ్యవస్థతో అనవసర మీటింగ్స్ తప్పితే ప్రయోజనం ఏమీ లేదన్నారు. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని ఫైర్ అయ్యారు. అందుకే మిడిల్ మేనేజర్స్‌ను తీసేసి.. ఇండివిడ్యువల్ ఎంప్లాయిస్‌కు ఎక్కువ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు జస్సీ.


వాళ్లకు మరింత ఫ్రీడమ్

ఇండివిడ్యువల్ ఎంప్లాయిస్‌కు ప్రాజెక్టుల మీద మరింత నియంత్రణ ఉండేలా చేయాలనుకుంటున్నట్లు జస్సీ క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి ఎక్కువ మంది బాస్‌లు లేకుండా చూసుకుంటామన్నారు. ఉద్యోగులకు మరింత స్వేచ్ఛను ఇచ్చి సంస్థ అభివృద్ధి కోసం కాంట్రిబ్యూట్ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని భావిస్తున్నామని అమెజాన్ సీఈవో పేర్కొన్నారు. సంస్థ బాగు కోసం అహర్నిషలు కృషి చేస్తున్న ఉద్యోగులకు కొత్త మార్పుల ద్వారా మరిన్ని పవర్స్, ఫ్రీడమ్ ఇస్తామన్నారు. వాళ్లు మరింత వేగంగా, సృజనాత్మకంగా, ధైర్యంగా పని చేసే వాతావరణాన్ని కల్పిస్తామని జస్సీ వివరించారు.


ఇవీ చదవండి:

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో మరో నాలుగు ప్రాజెక్టులు

‘డిస్‌ప్లే చిప్‌’ల తయారీలోకి టాటా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2025 | 12:18 PM