Share News

AP liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో ఐదు గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ

ABN , Publish Date - Jul 19 , 2025 | 07:09 PM

లిక్కర్ స్కామ్ కేసులో డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశించినట్లు తెలుస్తోంది. మిథున్‌రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

AP liquor Scam: ఏపీ లిక్కర్‌ కేసులో ఐదు గంటలకు పైగా వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ
AP liquor Scam

విజయవాడ, జులై 19: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత పాలనలో జరిగిన లిక్కర్‌ స్కామ్ వ్యవహారం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విచారణ ఇవాళ(శనివారం) సాయంత్రానికి ముగిసింది. ఐదు గంటలుగా ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై మిథున్ రెడ్డిని ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. మిథున్‌రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పోలీసులు.. లిక్కర్‌ కేసు ప్రాథమిక చార్జ్‌షీట్లను కోర్టుకు తీసుకెళ్తున్నట్లు సమాచారం.


కాగా, సిట్ అధికారులు ఏపీ లిక్కర్ కేసులో ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. 300 పేజీలతో కూడిన ఈ చార్జ్‌షీట్‌లో 100కు పైగా RFSL నివేదికలు పొందిపరిచినట్టు సమాచారం. రూ.62కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 268 మంది సాక్షులను విచారించినట్టు సిట్ చెప్పినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

ఫ్యాటీ లివర్‌తో బాధపడే వారు తప్పక తినాల్సిన ఫుడ్స్ ఇవే

మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే

Read Latest and Health News

Updated Date - Jul 19 , 2025 | 08:23 PM