Jangareddygudem Woman Harassed: దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:49 PM
రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కోడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు.
ఏలూరు, అక్టోబర్ 31: ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మహిళల పట్ల అత్తింట్లో అనేక దారుణాలు జరుగుతున్నాయి. అత్తింట్లో కొంతమంది మహిళలు పడుతున్న బాధలు వర్ణణాతీతం. వరకట్నం కోసం సాధింపులు, అనుమానంతో భర్త వేధింపులతో చాలా మంది మహిళలు ఇబ్బందిపడుతున్న పరిస్థితి. వీటిని ఎదుర్కొని కొందరు నిలబడితే మరికొందరు ఆడబిడ్డలు తనువు చాలిస్తున్న ఘటనలు ఎన్నో. ఇవన్నీ ఒకటైతే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన మాత్రం సభ్యసమాజం తలదించుకునేలా చేస్తుంది. భార్యా, భర్తల బంధానికి విలువ లేదా అని అనిపిస్తుంది. ఏలూరు జిల్లా (Eluru District) జంగారెడ్డిగూడెంలో ఓ మహిళను అత్తంటి వాళ్లు ఏ కారణంతో వేధిస్తున్నారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భర్త సోదరుడిని సుఖ పెట్టాలని వివాహితను అత్తామామలు, తోడికోడలు వేధింపులకు గురిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం రంజిత్ కుమార్ అనే వ్యక్తితో మహిళకు వివాహం జరిగింది. వీరికి ఏడాది కొడుకు ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులు ఓ విషయంపై అత్తమామలతో పాటు తోటి కోడలు కూడా మహిళను చిత్రహింసలు పెడుతున్నారు. భర్త సోదరిడితో మరొక వారసుడికి జన్మనివ్వాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి. అయితే ఇందుకు వివాహిత ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అత్తింటి వాళ్లు.. వివాహితను దాదాపు 10 రోజులు గదిలో నిర్బంధించారు. మహిళతో పాటు ఏడాది కొడుకును కూడా గదిలో బంధించారు. బంధించిన గదికి కరెంట్ , బాత్రూమ్, త్రాగు నీరు , తిండి లేకుండా అత్తంటి వారు అతి దారుణంగా ప్రవర్తించారు.
మహిళకు జరుగుతున్న అన్యాయంపై హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ చైర్ పర్సన్ మండెం లక్ష్మి, సభ్యులకు సమాచారం అందింది. బాధితురాలికి మద్దతు తెలుపుతూ ఇంటి ముందు మహిళా సంఘాలు టెంట్ వేసి నిరసనకు దిగాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
పాండురంగ స్వామి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
సునీతపై వివేకా హత్య కేసు నిందితుల సంచలన ఆరోపణలు
Read Latest AP News And Telugu News