వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం: నారాయణ
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:09 AM
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు

గుంటూరు(తూర్పు), విజయవాడ (వన్‌టౌన్), ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు, విజయవాడల్లో శనివారం జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ బోర్డు బిల్లు ముస్లింల సమస్య కాదని, అన్ని వర్గాల ఆస్తులను దోచుకుని బడా కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యని ఆరోపించారు. వక్ఫ్ బిల్లుకు సవరణలు సూచించామని చంద్రబాబు చెబుతున్నారని, అవేంటో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.