Home » CPI
పత్తి విక్రయాల నకిలీ ధ్రువపత్రాలు జారీ చేసి అక్రమ లాభాలు పొందిన జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ అధికారులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు విచారణలో చిక్కుకున్నారు. 60 వేల నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి, సాగు స్థలాన్ని పెంచి, భారీ లాభాలను సొంతం చేసుకున్నారు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఆయన ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాల గవర్నర్లందరూ ఆర్ఎస్ఎస్కి చెందినవారని, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ విమర్శించారు. గోశాల అంశాన్ని ఇక ముగించాలని, రాజధాని నిర్మాణానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు
బీఆర్ఎ్సతో కలిసి పనిచేసే ఆలోచన సీపీఐకి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, బీఆర్ఎస్ తప్పుడు విధానాల వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందన్నారు.
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మత సంస్థలపై బీజేపీ పెత్తనం కోసం తెచ్చిందని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. మైనారిటీల మనోభావాలను దెబ్బతీసేలా బీజేపీ, జనసేన వ్యాఖ్యలున్నాయని అన్నారు
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, తాము శాంతి చర్చలకు సిద్ధమేనని సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రకటించడంపై శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీ కార్మికుల సమస్యలు, ఇతర అంశాలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
మనిషి కి మరణం ఉంటుంది కానీ కమ్యూనిజానికి మరణం ఉండదు’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ శత వసంతాల ఉత్సవాలను ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
భూముల అమ్మకం ద్వారా రూ.పదివేల కోట్లు సేకరించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.