Indian Railways: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:27 PM
మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైల్వే శాఖ రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అమరావతి: రైళ్ల రాకపోకలపై ప్రధాన రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే శాఖ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది. విజయవాడ డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రధాన రైల్వేస్టేషన్ల హెల్ప్‌డెస్క్‌ల నంబర్లు :
విజయవాడ : 0866 2575167
గూడూరు : 08624 250795
నెల్లూరు : 90633 47961
ఒంగోలు : 78159 09489
బాపట్ల : 78159 09329
తెనాలి : 78159 09463
ఏలూరు : 75693 05268
రాజమండ్రి : 83319 87657
సామర్లకోట : 73823 83188
తుని : 78159 09479
అనకాపల్లి : 75693 05669
భీమవరం : 78159 09402
గుడివాడ : 78159 09462
మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. కోస్తా జిల్లాల మీదుగా నడిచే మొత్తం 95 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు విజయవాడ డివిజనల్ రైల్వే తెలిపింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ చేసుకున్న వారికి 24 గంటలు రీఫండ్ ఇవ్వటానికి వీలుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరోవై తుపాను కారణంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్లో ఎస్ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!