DGP Harish Gupta: ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం
ABN , Publish Date - Nov 20 , 2025 | 02:23 PM
మావోయిస్టులు లేని ఏపీని చేయడమే లక్ష్యమని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మావోల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను డీజీపీ పరిశీలించారు.
అల్లూరి జిల్లా, నవంబర్ 20: ఏపీలో ఆపరేషన్ సంభవ్ సక్సెస్ అయ్యిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) అన్నారు. గురువారం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో రంపచోడవరం చేరుకున్న డీజీపీ.. ఏవోబీ ప్రాంతంలో ఏరియల్ సర్వే చేశారు. ఆపై జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రెండు వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. ఎకే 47 గన్స్, రైపిల్, పేలుడుకు ఉపయోగించిన వస్తువులను పరిశీలించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. మారేడుమిల్లిలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు.
50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామన్నారు. ఈ ఏడాది జూన్‌లో రంపచోడవరంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో లొంగిపోవాలని మావోయిస్టులను హెచ్చరించామని తెలిపారు. మావోయిస్టులు లేని ఏపీగా చేయాలనుకున్నామని వెల్లడించారు. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు.
కాగా.. రెండు రోజుల క్రితం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలు నేలరాలిన విషయం తెలిసిందే. మొదటి ఎన్‌కౌంటర్‌లో మావో అగ్రనేత హిడ్మా, ఆయన సతీమణితో పాటు.. నలుగురు మావోయిస్టులు మరణించారు. రెండో రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడు మంది మావోలు హతమయ్యారు. వీరిలో కీలక నేతలు కూడా ఉన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో లభించిన డైరీ ఆధారంగా ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారికి వైద్య పరీక్షల అనంతరం ఆయా జిల్లాల కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు
ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు
Read Latest AP News And Telugu News