Visakhapatnam: ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:29 AM
విశాఖలో ఘోరం జరిగింది. చిన్నారిని హత్య చేసిన దుండగులు.. శరీర భాగాలను కల్వర్టులో పడేసి వెళ్లారు.
విశాఖపట్నం, నవంబర్ 20: రాను రాను సమాజంలో మానవత్వం కనబడకుండా పోతోంది. డబ్బు, ఆస్తుల విషయంలో బంధువులు, కుటుంబీకుల మధ్యే వాగ్విదాలు చోటు చేసుకోవడంతో పాటు... ప్రాణాలు తీసే వరకు వెళ్తోంది. ఏదో ఒక విషయంలో పక్కవాడిపై కోపాన్ని పెంచుకుని వారి అంతుచూసే వరకు విడిచిపెట్టని పరిస్థితి. ఆస్తి, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్లిపోతున్నారు. విచక్షణమరచి ప్రవర్తిస్తున్నారు. కొన్ని వివాదాల్లో చిన్నారులు బలైపోతున్నారు. పెద్దలపై ఉన్న కోపాన్ని చిన్నారులపై తీర్చుకుని రాక్షసానందం పొందుతున్నారు. ఇక... విశాఖలో ఘోరం జరిగింది. ఓ చిన్నారి విషయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దారుణం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం.
విశాఖపట్నంలో దారుణం జరిగింది. ఓ చిన్నారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణాతిదారుణంగా హతమొందించారు. చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. కల్వర్టులో చిన్నారి శరీర విడి భాగాలు పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు.. కల్వర్టులో చిన్నారికి సంబంధించిన కాళ్లు, చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు చిన్నారి ఎవరు?.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేశారా? చిన్నారికి సంబంధించిన మిగిలిన శరీర భాగాలు ఎక్కడ? చిన్నారి హత్యకు కారణం ఏంటి? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు పడి ఉండటంతో స్థానికంగా కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి..
లెక్కే లేదు... అమలు ఇంకెక్కడ...
రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు
Read Latest AP News And Telugu News