AP High Court: మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై హైకోర్టులో పిటిషన్
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:53 PM
మావోయిస్టు అగ్రనేతలను కోర్టులో హాజరుపర్చాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దేవజీ, రాజిరెడ్డి తమ వద్ద లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు.
అమరావతి, నవంబర్ 20: మావోయిస్టుల ఆచూకీ విషయంలో ఏపీ హైకోర్టులో (AP High Court) దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. మావోయిస్టు అగ్రనేతలు దేవజీ, మల్లా రాజిరెడ్డిలను కోర్టులో హాజరుపర్చేలా పోలీసులను ఆదేశించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రాజిరెడ్డి కుమార్తె స్నేహ లత, దేవజీ సోదరుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. వారు ఇరువురు తమ వద్ద లేరని హైకోర్టుకు పోలీసులు నివేదించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చామని వివరణ ఇచ్చారు.
వారు ఇరువురు పోలీసులు వద్ద ఉన్నారనేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్‌మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రెస్ స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచుతామని పిటిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటి (శుక్రవారాని)కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
రైతు బజార్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. కీలక సూచనలు
ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు
Read Latest AP News And Telugu News