Share News

Ministers On Montha Cyclone: మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:25 AM

మెుంథా తుపాన్ గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు.

Ministers On Montha Cyclone: మొంథా తుపాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..
Minister Narayana

అమరావతి: మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుపాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుపాన్‌తో ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ముందస్తు సమాచారం అందేలా చూడాలన్నారు. రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పునరావాస శిబిరాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని వివరించారు. విద్యుత్‌ అంతరాయం, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.


మరోవైపు మంత్రి పార్థసారథి మొంథా తుపాన్‌‌పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దూసుకొస్తున్న మొంథా తుపాన్ వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా.. అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఈ సందర్భంగా ABNతో ఆయన మాట్లాడారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక అధికారులు నియమించినట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తుపాన్ తీవ్రతను బట్టి పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాలని సూచించారు. మెుంథాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతన్నట్లు చెప్పారు. వివిధ శాఖల అధికారులు 24/7 అప్రమత్తం ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 03:13 PM