Rushikonda Contravorsy: రుషికొండ ప్యాలెస్ బిల్లుల అంశం... ఆ అధికారులపై మంత్రి పయ్యావుల ఫైర్
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:03 PM
Payyavula Keshav: రుషికొండపై జగన్ సర్కార్ చేపట్టిన నిర్మాణాలు మరోసారి చర్చకు దారితీసింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ వినరా అని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రకృతిని సర్వనాశనం చేస్తూ గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ నిర్మాణాలు చేపట్టడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సీరియస్ అయ్యారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్‌కు ఎందుకు బిల్లులు చెల్లించారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావుల మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశాలు జారీ చేశారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారులు వెల్లడించారు.
అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్లుగా అధికారులు వివరించారు. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టర్‌కు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని నిలదీశారు. గతంలో ఓసారి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టర్‌కు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని మంత్రి పయ్యావుల ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా..? లేక సొంత నిర్ణయమా..? అంటూ అధికారులకు మంత్రి ప్రశ్నలు సంధించారు. ఇకపై ఆ కాంట్రాక్టర్ చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లులు చెల్లించవద్దని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు లేదా తన దృష్టికి తీసుకు రాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu : నేరుగా అర్జీదారుల వద్దకే!
Transgender Welfare: రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు
Nimmala Ramanaidu : ఆ ట్వీట్ జగన్ నేర స్వభావాన్ని చాటుతోంది
Read Latest AP News and Telugu News