Share News

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:41 PM

Venkaiahnaidu: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాతృభాషను ప్రోత్సహించాలని కోరారు.

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు
Former Vice President Venkaiah Naidu

విశాఖపట్నం, మార్చి 6: తెలుగు భాషలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ హర్షణీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venakaiah Naidu) అన్నారు. విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateshwar Rao) రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన గుర్తింపునకు చరిత్ర అనేది ఒక పునాది అని తెలిపారు. ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలికేమీ కాదన్నారు. ఎన్టీఆర్‌ (NTR) నటన గురించి పుస్తకం రాయడం కూడా సాధ్యమయ్యే పని కాదన్నారు. వివిధ సంఘటనల క్రమేణా ఎలా మారాయో చరిత్ర చెబుతుందని తెలిపారు.


రాజకీయాలు, ఆర్థికశాస్త్రం, మానవ సమాజంలోని అన్ని అంశాలు చరిత్ర చెబుతుందని చెప్పారు. చరిత్ర ద్వారా అన్ని తెలుసుకుని భవిష్యత్‌లో ముందుకెళ్లాలని ఆయన అన్నారు. చరిత్రను సరిగా నమోదు చేయడం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. భారత దేశ చరిత్ర వక్రీకరణకు గురైందన్నారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావడం ముదావహమని పేర్కొన్నారు.


‘‘నేను ప్రస్తుతం రాజకీయాల్లో లేను. నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు’’ అని అన్నారు. మాతృభాషలో విద్యను ప్రోత్సహించాలని తెలిపారు. ముందు మాతృభాషను అందరూ నేర్చుకోవాలని సూచించారు. మాతృభాష కళ్ల వంటిది.. ఆంగ్ల భాష కళ్లద్దాల వంటిదని మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

Chandrababu - Modi Tweet: ఎమ్మెల్సీల విజయంపై మోదీ అభినందనలు.. థాంక్స్ చెప్పిన సీఎం

BJP victory: బీజేపీలో కొత్త ఉత్తేజం.. ఆ ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు ప్లాన్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2025 | 01:41 PM