Share News

Ganta Angry on Jagan: జగన్‌పై గంటా శ్రీనివాస్ హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:37 PM

Ganta Srinivas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షహోదాకు జగన్ పట్టుబట్టడంపై మండిపడ్డారు మాజీ మంత్రి. 11 సీట్లు ఉన్న జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.

Ganta Angry on Jagan: జగన్‌పై గంటా శ్రీనివాస్ హాట్ కామెంట్స్
Former Minister Ganta Srinivas Rao

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌ నిలిచింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన జగన్ (YS Jagan).. పీచేముడ్ అన్నట్లుగా నిన్న (సోమవారం) శాసనసభకు వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టించినప్పటికీ జగన్ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. సభలో జగన్ ప్రవర్తించిన తీరుపట్ల అధికారపక్షం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. కేవలం అటెండెన్స్‌ కోసమే జగన్ అసెంబ్లీకి వచ్చారని ధ్వజమెత్తుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు (Former Minister Ganta Srinivas Rao) స్పందిస్తూ.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులని.. జగన్‌కు చంద్రబాబు సమకాలీకుడు కాదని ఆయన గ్రహించాలన్నారు. 11 సీట్లు వచ్చిన జగన్ అసెంబ్లీలో మూసుకొని కూర్చోవాలంటూ కామెంట్స్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ను స్వాగతించకుండా జగన్ వ్యవరిస్తున్న తీరు సరికాదన్నారు. జగన్ ప్రజల సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. 11 సీట్లు ఉన్న జగన్‌కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు మీద, ప్రతిపక్ష హోదాపై జగన్ మాట్లాడిన వీడియో క్లిప్స్‌ను ఈ సందర్భంగా గంటా మీడియా సమావేశంలో ప్రదర్శించారు. జగన్ వైఖరి నచ్చకపోవడం వల్లనే విజయ సాయి రెడ్డి వెళ్లి పోయారని... ఇంకా ఎంతో మంది పార్టీ వీడడానికి రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి జగన్ నిన్న అసెంబ్లీకి వచ్చారని గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

jagan-mohan-reddy.jpg

Seethakka criticizes Bandi Sanjay: బండి సంజయ్‌ వ్యాఖ్యలు.. సీతక్క మాస్ వార్నింగ్


ఆ ఘనత జగన్‌ సర్కార్‌దే...

గంటా ఇంకా మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతోందన్నారు. పాకలపాటి రఘువర్మకు కూటమి పార్టీలు మద్దతు ప్రకటించామని తెలిపారు. ఆయనను అందరూ గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో ఎంతో ఉందన్నారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెట్టిన ఘనత జగన్ సర్కార్ దే అంటూ మండిపడ్డారు. విద్యా రంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించాలని కోరారు. కూటమిలో మూడు పార్టీలు సంపూర్ణంగా రఘువర్మకు మద్దతు ఇస్తున్నాయన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే రఘువర్మను భారీ మెజార్టీతో గెలిపించాలని గంటా శ్రీనివాస్ రావు కోరారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన లోకేష్

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు.. ఆప్‌కు భారీ షాక్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 03:51 PM