AP News: వైసీపీ హయాంలో జరిగిన పాపాలు బయటకు..
ABN , Publish Date - Apr 29 , 2025 | 10:58 AM
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అనకాపల్లి: వైసీపీ (YCP) హయాంలో జరిగిన పాపాలను పోలీసులు (Police) బయటకు తీసుకువస్తున్నారు. వైసీపీ హయాంలో పట్టించుకోని కేసులను (Cases) ఇప్పుడు దర్యాప్తు చేపట్టి పురుగతి సాధిస్తున్నారు. అనకాపల్లి (Anakapalli) జిల్లాలో టీడీపీ (TDP) కార్యకర్త లక్ష్మణ్ (Lakshman) కిడ్నాప్ (kidnap).. దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ ఎంపీపీతో పాటు ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ హాయాంలో ఆ పార్టీ నేతల తప్పులను టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దీంతో లక్ష్మణ్‌ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా కొట్టారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయినా.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు.
Also Read: ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభ వార్త..
ప్రస్తుతం కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసులో వైసీపీ నేతలు మాజీ ఎంపీపీ సత్యనారాయణ, గాంధీ అయ్యప్ప, గోవిందులను పోలీసులు అరెస్టు చేశారు. 2022లో టీడీపీకి చెందిన లక్ష్మణ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. అప్పుడు చంద్రబాబు, మిగిలినవారిపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, విమర్శలపై లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేశాడు. మరోవైపు తన కుమారుడికి కూడా చంద్రబాబు పేరు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు లక్ష్మణ్‌ను కిడ్నాప్ చేసి.. తీవ్రస్థాయిలో చిత్రహింసలకు గురిచేశారు. అప్పట్లో దీనిపై పెద్ద వివాదమే చెలరేగింది. అయితే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
ఈ ఘటనపై కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం రాత్రి సత్యనారాయణతోపాటు ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి కష్టాలు రెట్టింపు అయ్యాయి. గతంలో చేసిన పాపాలకు ఒకొక్కరుగా బుక్కవుతున్నారు. వైసీపీ పాలనలో చేసిన కబ్జాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
పాకిస్థాన్ దేశస్థులు భారత్‌ను వీడేందుకు చివరి రోజు..
చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో హైడ్రామా
For More AP News and Telugu News