Mobile phone recovery: మొబైల్ ఫోన్ల రికవరీ మేళా.. మీ ఫోన్ ఉందేమో చూసుకోండి
ABN , Publish Date - Feb 05 , 2025 | 01:24 PM
Anakapalli: అనకాపల్లిలో సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు పోలీసులు. ఫోన్ పోగొట్టుకున్న వారికి తిరిగి వారి ఫోన్లను అందజేశారు. మొత్తం తొమ్మిది విడతల్లో 2,711 ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

అనకాపల్లి జిల్లా. ఫిబ్రవరి 5: అనకాపల్లి (Anakapalli) జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. తొమ్మిది విడతలో రికవరీ చేసిన 503 మొబైల్‌లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా లబ్ధిదారులకు అందజేశారు. సెల్ ఫోన్లను రికవరీ చేసిన ఐటీ కోర్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ... అనకాపల్లి జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది విడతల్లో 2,711 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ నాలుగు కోట్ల ఏడు లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు.
అయితే సెల్‌ఫోన్ పోగొట్టుకున్న అనేక మంది ఈ మేళాకు తరలివచ్చారు. పోయిందనుకున్న ఫోన్ తిరిగి తమ దరికి చేరడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వేల రూపాయలు పెట్టి కొన్న ఫోన్లు చోరీకి గురవడంతో ఎంతో బాధపడ్డామని.. తిరిగి ఫోన్ వస్తుందనే ఆశలు వదిలేసుకున్న సమయంలో ఫోన్ గురించి పోలీసులు ఇచ్చిన సమాచారంతో వెంటనే మొబైల్ రికవరీ మేళాకు వచ్చి ఫోన్లను తీసుకున్నామంటూ అక్కడి వచ్చిన లబ్దిదారులు చెబుతున్నారు.
Aga Khan: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఆగాఖాన్ మృతి పట్ల రేవంత్ సంతాపం
సాధారణంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ పోతే దానిగురించి మర్చిపోయి.. మరొకటి కొనుక్కోడం సర్వసాధారణమైపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా మొబైల్ దొరకడం కష్టమనే భావన ప్రజల్లో నెలకొంది. కొన్ని సందర్భాల్లో మొబైల్ చోరీ ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడంలేదనే విమర్శలు వచ్చాయి. మొబైల్ ఫోన్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏవైనా ఉన్నా, లేదంటే విలువైన ఫోన్లు అయినప్పుడు మాత్రమే మొబైల్ చోరీపై పోలీసులకు ఫిర్యాదులు చేసేవారు. ఈ క్రమంలో మొబైల్ చోరీపై అందిన ఫిర్యాదులపై దర్యాప్తు చేపట్టిన అనకాపల్లి జిల్లా పోలీసులు ఇప్పటివరకు 9 విడతల్లో దాదాపు 2,711 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం రికార్డుగా చెబుతున్నారు. తాజాగా 500కు పైగా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు.
ఫోన్ ఎలా ట్రేస్ చేస్తారు
పోలీసులకు మొబైల్ పోయిందని ఫిర్యాదు చేసే సమయంలో తప్పనిసరిగా ఫోన్ ఐఎంఈఐ నెంబర్‌ను ఫిర్యాదులో పొందుపర్చాలి. ఆ నెంబర్ ఆధారంగానే పోలీసులు ఫోన్ ట్రేస్ చేస్తారు. చోరీ చేసిన మొబైల్‌లో ఎవరైనా వేరే సిమ్ వేసి ఉపయోగిస్తున్నటయితే ఈ ఐఎంఈఐ నెంబర్‌పై ఏ ఫోన్ నెంబర్ వాడుతున్నారో గుర్తించి, దాని ఆధారంగా వివరాలు సేకరిస్తారు. ఫోన్ ఉపయోగిస్తున్న వ్యక్తిని గుర్తించి మొబైల్ రికవరీ చేస్తారు. దీనికోసం మెబైల్ నెట్‌వర్క్ కంపెనీల సహకారాన్ని పోలీసులు తీసుకుంటారు.
ఇవి కూడా చదవండి..
తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్ ..
Breaking News: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం శుభవార్త..
Read Latest AP News and Telugu News