Share News

AP Special Officers: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు..

ABN , Publish Date - Oct 26 , 2025 | 09:12 AM

ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్ జైన్‌ను.. దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా ఆర్‌పీ సిసోడియాలను నియమించారు.

AP Special Officers: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు..

అమరావతి: మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ జీఓఆర్టీ నెంబర్ 1982 జారీ చేసింది. ఈ ప్రత్యేక అధికారులు రిలీఫ్ రిహాబిలిటేషన్ కార్యక్రమాలను తుఫాను ప్రభావంతో వర్షాలు తగ్గేవరకు చేపట్టాలని ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లాకు కేవీఎన్ చక్రధర బాబు, విజయనగరం జిల్లాకు పి.రవి సుభాష్, మన్యం జిల్లాకు నారాయణ భరత్ గుప్తా, విశాఖపట్నం జిల్లాకు అజయ్ జైన్, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు వాడ్రేవు వినయ్ చంద్, తూర్పుగోదావరి కి కే కన్నబాబు, కాకినాడ జిల్లాకు విఆర్ కృష్ణ తేజ, కోనసీమ జిల్లాకు విజయరామరాజు, పశ్చిమగోదావరి జిల్లాకు ప్రసన్న వెంకటేష్, ఏలూరు జిల్లాకు కాంతిలాల్ దండే, కృష్ణా జిల్లాకు కాటా ఆమ్రపాలి, ఎన్టీఆర్ జిల్లాకు శశి భూషణ్ కుమార్, గుంటూరు జిల్లాకు ఆర్ పి సిసోడియా, బాపట్ల జిల్లాకు ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రకాశం జిల్లా కు కోన శశిధర్, నెల్లూరు జిల్లాకు ఎన్ యువరాజ్, తిరుపతి జిల్లాకు పి అరుణ్ బాబు, చిత్తూరు జిల్లాకు పిఎస్ గిరీషాలను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.


ఉత్తర కోస్తా జిల్లాలు అయిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్‌ఆర్, ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా అజయ్ జైన్‌ను.. దక్షిణ కోస్తా జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు జోనల్ ఇన్చార్జిగా ఆర్‌పీ సిసోడియాలను నియమించారు. ఈ అధికారులంతా వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని సైక్లోన్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పునరావాస కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

Congress Demands: పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్‌

Updated Date - Oct 26 , 2025 | 09:31 AM