Political Meeting : షర్మిలతో సాయిరెడ్డి భేటీ!
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:14 AM
వైసీపీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన విజయసాయిరెడ్డి... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిలతో భేటీ అయినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో 3 గంటలపాటు సమావేశం
అమరావతి/హైదరాబాద్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ఇటీవలే రాజ్యసభకు, వైసీపీకి, రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన విజయసాయిరెడ్డి... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిలతో భేటీ అయినట్లు తెలిసింది. 2 రోజులకిందట హైదరాబాద్ లోట్‌సపాండ్ లో దాదాపు 3 గంటలపాటు షర్మిలతో చర్చలు జరిపినట్లు విశ్వసనీ య సమాచారం. షర్మిల-జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల వివాదంలో సాయిరెడ్డి గతంలో జగన్ వైపే నిలిచారు. దీంతో అప్పట్లో ఆయనపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి కూడా సాయిరెడ్డి నిజాలు చెప్పాలంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల వైసీపీకి సాయిరెడ్డి రాజీనామా చేసిన అనంతరం షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్‌కు విజయ సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. జగన్ ఏం చెబితే అది చేయడం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడం ఆయన పని. రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి ఆయన. జగన్ ఆదేశిస్తేనే ఆయన ఇలా చేశారు అలాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేశాడంటే చిన్న విషయం కాదు’’ అని షర్మిల పేర్కొన్నారు. అలాంటిది... ఇప్పుడు సాయిరెడ్డే షర్మిలతో సమావేశం కావడం విశేషం. ఈ భేటీ జరగడం అటు కాంగ్రెస్, ఇటు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
For AndhraPradesh News And Telugu News